22వ కేన్స్(Cannes) వేడుకలకు ప్రపంచ అందగత్తె ఐశ్వర్యారాయ్(Aishwarya Rai) హాజరయ్యారు. తొలిరోజు హాఫ్ వైట్ శారీలో నుదుటన సింధూరం పెట్టుకుని భారతీయత ఉట్టిపడేలా రాయల్ లుక్‌లో కనిపించిన ఆమె.. రెండో రోజూ భారతీయ సంస్కృతి సంప్రదాయలకు విలువనిచ్చారు. భగవద్గీత శ్లోకంతో ఉన్న డ్రెస్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు.
ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా ఈ ఫొటోలు షేర్ చేస్తూ.. ‘‘ఐశ్వర్య ధరించిన డ్రెస్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఆ బనారసీ కేప్‌పై భగవద్గీతలోని ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన’ అనే శ్లోకాన్ని చేతితో సంస్కృతంలో ఎంబ్రాయిడరీ చేశారు’’ అని తెలిపారు. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఐశ్వర్య లుక్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఇటీవల యునెస్కో (UNESCO) మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్‌లో భగవద్గీతకు చోటు లభించిన సంగతి తెలిసిందే.