గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Seenu) మాస్ కాంబోలో ‘అఖండ2- తాండవం'(Akhanda 2) మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ పూజా కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో బాలయ్య చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. దీంతో అభిమానులు ఈ సినిమా రిలీజ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఫ్యాన్స్‌కు మేకర్స్ గుడ్ న్యూస్ అందించారు. మూవీ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ రిలీజ్ ప్రోమో విడుదల చేశారు.
వచ్చే ఏడాది దసరా పండుగా సందర్భంగా సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ చేయనున్నట్లు ఇందులో ప్రకటించారు. ఈ బాలయ్య సినిమా లాంఛ్ సమయంలో బాలయ్య చెప్పిన డైలాగ్ ప్లే చేస్తూ.. పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేశారు. కాగా బాలయ్య, బోయపాటి కయిలకలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచిన విషయం విధితమే. కరోనా సమయంలో వచ్చిన ‘అఖండ’ మూవీ అయితే బాలయ్య అభిమానులకు పూనకాలు తెప్పించింది. ‘అఖండ2’తో కూడా ఇదే మేజక్ రిపీట్ చేయాలని కోరుతున్నారు.