Akhanda Thandavam Release Date : బాలయ్య , బోయపాటి కాంబినేషన్ అంటే ఫాన్స్ కి పూనకాలే . మరి ఆ హాట్రిక్ కాంబినేషన్ నుంచి వస్తున సినిమానే “ అఖండ తాండవం ”. ఆల్రెడీ అఖండ పార్ట్ 1 ఎంతటి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సొంతం చేసుకుందో మనం చూశాం . ఇక అలాంటి మూవీ నుంచి సీక్వెల్ అంటే అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. ఇక ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్ అదే పని చేసింది బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో మరొక బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అన్నట్టు కనిపిస్తుంది.
ఇది ఇలా ఉంటే “ అఖండ 2 ” ముందుగా సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుంది అని అందరూ అనుకుంటూ వచ్చారు . కానీ కొన్ని కారణాలు వల్ల అది జరగలేదు . ఐతే రిలీజ్ డేట్ కోసం ఫాన్స్ మాత్రమే కాదు సిని ప్రేమికులు కూడా ఎప్పటినుంచో ఆశగా ఎదురుచూస్తున్నారు . ఐతే మొత్తానికి “ అఖండ తాండవం ” డిసెంబర్ 5న థియేటర్స్ లో సందడి చేయబోతుంది .
ALSO READ: https://teluguprabha.net/cinema-news/chiranjeevi-praises-og-movie/
అలాగే రీసెంట్ గా ఓజీ సినిమాతో కొణిదెల తమన్ గా మారిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ త్వరలో అఖండ 2 తో మళ్లీ నందమూరి తమన్ గా మారబోతున్నాడు.
అసలే బాలయ్య సినిమా అంటే తమన్ మ్యూజిక్ కి
స్పీకర్స్ పగిలిపోవాల్సిందే. మరి ఈసారి తన మ్యూజిక్ తో ఏ రేంజ్ లో తాండవం ఆడతాడో చూడాలి అని బాలయ్య ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇక బోయపాటి సినిమాలో హీరోస్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో, విలన్స్ కూడా అంతే పవర్ రోల్స్ లో కనిపిస్తూ ఉంటారు . అఖండ లో శ్రీకాంత్ ని ఎలా చూపించాడో మనం చూసాం . ఇప్పుడు అఖండ తాండవం లో మాత్రం ఆది పినిశెట్టి ని విలన్ రోల్ చూపించబోతున్నాడు అని తెలుస్తుంది . రిలీజ్ అయిన టీజర్ లో కూడా తన ఫేస్ ని పూర్తిగా చూపించలేదు . అయిన కూడా తన రోల్ ఎలా ఉండబోతుందో అర్థం అయిపోతుంది టీజర్ లో కనిపించిన ఒక్క షార్ట్ చూస్తుంటే . పైగా టెక్నికల్ గా కూడా సినిమా చాలా గ్రాండ్ గా ఉండబోతుంది అని
మూవీ యూనిట్ చెబుతుంది. హిమాలయాల్లో షూట్ చేసిన సీక్వెన్స్ అంత కూడా థియేటర్స్ లో అదిరిపోతుంది అని చెప్తున్నారు మూవీ టీమ్.
ఇంకా సినిమాలో ఎన్ని సర్ప్రైజ్ లు ఉన్నాయో తెలియాలి అంటే డిసెంబర్ 5 వరకు ఆగాల్సిందే.
ఈసారి టైటిల్ లో చెప్పినట్టు గానే థియేటర్స్ లో బాలయ్య తాండవం చూస్తాం అని మాత్రం అర్థం అవుతుంది రిలీజ్ అయిన ప్రొమోషనల్ మెటీరియల్ చూస్తుంటే.


