Saturday, November 15, 2025
HomeTop StoriesNandamuri Balakrishna: 'అఖండ 2' ఓటీటీ డీల్ అందుకే క్లోజ్ అవలేదా..?

Nandamuri Balakrishna: ‘అఖండ 2’ ఓటీటీ డీల్ అందుకే క్లోజ్ అవలేదా..?

Akhanda 2 Thaandavam: సాధారణంగా పెద్ద బ్యానర్ నుంచి వచ్చే ఏ సినిమాకైనా కాస్త బజ్ ఉంటే థియేట్రికల్ నుంచి ఓటీటీ వరకూ బిజినెస్ ముందే జరిగిపోతుంటుంది. కానీ, నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ 2: తాండవం’ ఓటీటీ డీల్ ఇంకా క్లోజ్ అవలేదని సమాచారం. బాలకృష్ణ, బోయపాటి శ్రీనుది హ్యాట్రిక్ కాంబినేషన్. ఇప్పటికే ఈ కాంబోలో సింహా, లెజెండ్, అఖండ వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళను రాబట్టాయి. ఇప్పుడు ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్‌గా ‘అఖండ 2: తాండవం’ రూపొందుతోంది. ఈ సినిమాను డిసెంబర్ 5న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ డేట్ లాక్ చేశారు. ఇటీవల, ‘అఖండ 2’ నుంచి వచ్చిన టీజర్ మంచి హైప్ క్రియేట్ చేసింది. బోయపాటి మార్క్ ఎక్కడా తగ్గలేదనిపించింది.

- Advertisement -

జస్ట్ టీజర్‌తోనే బాలయ్య రోల్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో డైలాగ్ ద్వారా బోయపాటి శాంపిల్ చూపించారు. నందమూరి అభిమానుల్లో మాత్రమే కాకుండా ప్రేక్షకుల్లోనూ ‘అఖండ 2’పై అంచనాలు బాగా ఏర్పడ్డాయి. కానీ, ఇంతవరకూ ఓటీటీ డీల్ క్లోజ్ కాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అయితే, ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు, ఈ మూవీ ఓటీటీ డీల్‌ని ముందు జియో హాట్ స్టార్‌కి అనుకున్నారు. అఖండ సక్సెస్‌ని దృష్టిలో పెట్టుకొని సీక్వెల్‌కి 90 కోట్ల వరకు డిమాండ్ చేశారట.

Also Read: https://teluguprabha.net/cinema-news/star-heroes-sons-struggles-in-film-industry/

ఈ భారీ మొత్తంకి జియో వారు వెనక్కి తగ్గారట. అమెజాన్ ప్రైమ్ కూడా అంతగా ఆసక్తి చూపకపోవడంతో మేకర్స్ నెట్‌ఫ్లిక్స్‌ని సంప్రదించారని సమాచారం. నిర్మాతలు 75 కోట్లకు దిగినా నెట్‌ఫ్లిక్స్ ముందుకు రాలేదనీ, దాంతో 65 కోట్లకి డీల్ క్లోజ్ చేయాలని అనుకున్నారనీ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికీ డీల్ క్లొజవలేదని తెలుస్తోంది. డిసెంబర్ 5న సినిమా విడుదల ఉండగా, ఇప్పటికీ ఓటీటీ డీల్ పెండింగులో ఉండటం ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. బాలయ్య సినిమాలు ఈ మధ్యన వరుసగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళను రాబడుతున్నాయి. అయినా, ‘అఖండ 2’కి ఓటీటీ డీల్ ఇప్పటికీ క్లోజ్ కాకపోవడం ఆశ్చర్యకరమే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad