Sunday, June 22, 2025
Homeచిత్ర ప్రభAkhil Akkineni: ఇక మిగిలింది అఖిల్ మాత్ర‌మే..!

Akhil Akkineni: ఇక మిగిలింది అఖిల్ మాత్ర‌మే..!

Lenin Movie: అక్కినేని ఫ్యామిలీ హీరోలలో నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ హీరోలుగా సినిమాలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫ్యామిలీ హీరోల్లో ముగ్గురికి కొన్నాళ్లుగా స‌రైన హిట్స్ లేకుండా ఉండింది. అక్కినేని అభిమానుల‌కు ఇది పెద్ద స‌మ‌స్య‌గా ఉండింది. అయితే ఇప్పుడు ముగ్గురిలో ఇద్ద‌రికీ హిట్ మూవీస్ ఖాతాలో ప‌డ్డాయి. ముందుగా నాగార్జ‌న అక్కినేని విష‌యానికి వ‌స్తే.. రీసెంట్‌గా ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన కుబేర రిలీజైన సంగ‌తి తెలిసిందే. ధ‌నుష్ హీరోగా ఉండ‌గా, నాగార్జున ఈ పాత్ర‌కు ఎలా ఒప్పుకున్నాడు..! అని ఆశ్చర్యపోయిన వారే ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు.

- Advertisement -

కుబేర సినిమా కంటే ముందు నాగ్ చేసిన సినిమాలు ఏవీ అంతగా ఆడలేదు. కానీ, పాన్ ఇండియా సినిమా శేఖర్ కమ్ముల రూపొందించిన లేటెస్ట్ మూవీ కుబేర మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇందులో ఆయ‌న పాత్ర‌లో గ్రే షేడ్స్ ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న క‌థా బ‌లం, శేఖ‌ర్ క‌మ్ముల‌పై న‌మ్మ‌కంతో సినిమా చేయ‌టానికి అంగీక‌రించారు. ఆయ‌న న‌మ్మ‌క‌మే ఇప్పుడు నిజ‌మైంది. ఇప్పుడు నాగ్ పెద్ద కుమారుడు నాగ చైత‌న్య విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న‌కు కూడా సాలిడ్ హిట్ ప‌డి చాలా స‌మ‌య‌మే ప‌ట్టింది. అయితే చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన తండేల్ మూవీ ఆ కొర‌త‌ను తీర్చేసింది. ఈ మూవీతో చైత‌న్య ఏకంగా 100 కోట్ల క్ల‌బ్‌లోచేర‌టం విశేషం. ప్రస్తుతం తన 24వ సినిమాతో బిజీగా ఉన్నాడు చైతూ. మ‌రో వైపు త‌న 25వ సినిమాను శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌టానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే, అక్కినేని ఫ్యామిలీ హీరోల్లో ఇప్పుడు వెనుక‌బ‌డిన వాడు అఖిల్ అక్కినేని.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/bollywood-star-salman-khan-opens-about-his-health-issues/

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేసిన ఏజెంట్ సినిమా చేస్తే అది కనీసం ఉందని, వచ్చిందని కూడా ఏ ఒక్కరికీ గుర్తు లేదు. ఇదే కాదు, అఖిల్ కెరీర్ ముందునుంచి కాస్త ఇబ్బందిగానే సాగుతోంది. అప్పుడో ఇప్పుడో ఓ హిట్ పడుతుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కాస్త చెప్పుకునే హిట్ సాధించింది. ప్రస్తుతం ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో లెనిన్ అనే సినిమాను చేస్తున్నాడు అఖిల్. ఇందులో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. న‌వంబ‌ర్‌లో ఈ సినిమాను విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నారు.

అయితే, అక్కినేని ఫ్యాన్స్ అందరూ మాట్లాడుకుంటుంది ఒకటే. నాగార్జునకి కుబేర మూవీతో హిట్ దక్కింది. నాగ్ చైతన్య నెమ్మదిగా సినిమాలు చేస్తూ మంచి సక్సెస్‌లు చూస్తున్నాడు. కానీ, అఖిల్ కే హిట్ కరువైంది అని. ఈ హీరోకి ఓ సాలీడ్ హిట్ పడితే బ్యాలెన్స్ అవుతుందని చెప్పుకుంటున్నారు. యంగ్ డైరెక్టర్ మురళి కొషోర్ అబ్బూరి దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న లెనిన్ మూవీ మీద టీజర్ వచ్చాక అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలకి తగ్గట్టుగా సినిమా హిట్ అయితే అఖిల్ కూడా ఫార్మ్ లోకి వచ్చేస్తాడు. చూడాలి మరి లెనిన్ తో అఖిల్ గ్రాఫ్ పెరుగుతుందా..? ఇంకా తగ్గుతుందా..?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News