Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభLenin: అఖిల్ ‘లెనిన్’ కొత్త సవాళ్లు

Lenin: అఖిల్ ‘లెనిన్’ కొత్త సవాళ్లు

Akhil Akkineni: టాలీవుడ్ యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని తన కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. అతడు సినీ రంగంలోకి వచ్చి పదేళ్లు పూర్తి చేసుకున్నా, ఇప్పటివరకు చేసిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. భారీ అంచనాలతో 2023లో విడుదలైన ‘ఏజెంట్’ చిత్రం తీవ్రంగా నిరాశపరిచి డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ‘హలో’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి సినిమాలు ఫర్వాలేదనిపించినా, అక్కినేని అభిమానులు అఖిల్ నుంచి ఇంకా ఏదో కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, అఖిల్ చాలా గ్యాప్ తీసుకొని, ఆచితూచి అడుగులు వేస్తూ చిత్రం ‘లెనిన్’తో బిజీగా ఉన్నారు. ఈసారి ఎలాగైనా పక్కా హిట్ కొట్టాలనే కసితో అఖిల్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఈ సినిమాకు విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ ఫేమ్‌ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ‘లెనిన్’ సినిమాకు సంబంధించిన టీజర్‌ను మేకర్స్ ఏప్రిల్‌లో అఖిల్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్‌లో అఖిల్ మునుపెన్నడూ కనిపించని కొత్త మాస్ లుక్‌లో కనిపించాడు. ఇదే టీజర్ గ్లింప్స్‌లో హీరోయిన్‌గా శ్రీలీల కనిపించనున్నట్లు తెలిసింది. ఆమె రెండు జడలు వేసుకొని పల్లెటూరి అమ్మాయిలా కనిపించింది.

Also Read – Nimisha Priya Death Sentence in Yemen :యెమెన్‌లో ఉరిశిక్ష పడిన నిమిష ప్రియ.. చివరి నిమిషంలో సుప్రీంకోర్టు జోక్యం!

లెనిన్ సినిమా షూటింగ్‌కు ఆరంభం నుంచే ఇబ్బందులు తప్పడం లేదు. ముందుగా ఇందులో హీరోయిన్‌గా ఎంపికైన శ్రీలీల, కేవలం రెండు లేదా మూడు వారాల షూటింగ్ తర్వాతే ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. శ్రీలీల తప్పుకోవడంతో, ఆమె స్థానంలో భాగ్య శ్రీ బోర్సేను కొత్త హీరోయిన్‌గా తీసుకున్నారు. అయితే ఇక్కడే నిర్మాతలకు అసలు తలనొప్పి వచ్చి పడింది. ముందుగా శ్రీలీలపై చిత్రీకరించిన సన్నివేశాలను ఇప్పుడు పూర్తిగా తొలగించాల్సి వస్తుంది. అంతేకాకుండా ఆ సన్నివేశాలను మళ్లీ రీషూట్ చేయాల్సి ఉంది. దీని వ‌ల్ల స‌మ‌యంతో పాటు ప్రొడ‌క్ష‌న్ ఖ‌ర్చు కూడా పెరుగుతుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో మళ్లీ ప్రారంభించారు. పల్లెటూరి సెట్స్ వేసి షూటింగ్ చేస్తున్నారు. ఇది మేకర్స్‌కు అదనపు భారంగా మారిందని తెలుస్తోంది.

ఈ సినిమా రూరల్ బ్యాక్‌డ్రాప్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ సంగీతం అందిస్తుండగా, నవీన్ నూలీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. అంతా అనుకున్నట్లు షూటింగ్ సజావుగా సాగితే, 2026లో సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని మేకర్స్ చెబుతున్నారు. అఖిల్ ఈ సినిమాతోనైనా తన కెరీర్‌లో ఎదురుచూస్తున్న బ్లాక్‌బస్టర్ కలను నెరవేర్చుకుంటాడో లేదో వేచి చూడాలి.

Also Read – Rajinikanth: కూలీ కంటే ముందు ర‌జ‌నీకాంత్‌, ఆమిర్‌ఖాన్ క‌లిసి న‌టించిన మూవీ ఇదే – ఎపిక్ డిజాస్ట‌ర్‌!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad