Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభAkira Nandan: ఓజీ లో అకీరా కి ఎందుకు అవకాశం ఇవ్వలేదు?

Akira Nandan: ఓజీ లో అకీరా కి ఎందుకు అవకాశం ఇవ్వలేదు?

 

- Advertisement -

AKIRA IN OG : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఒక్కటే టాపిక్. అదే ఓజీ. సుజిత్ సంభవం, తమన్ తాండవం, పవన్ ప్రళయం – ఈ ముగ్గురు కలిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రేక్షకులు చూసారు. కానీ ‘ఓజీ’ రిలీజ్ కి ముందే ఫ్యాన్స్ ఇంతగా హైప్ అవ్వడానికి కారణాలు రెండు. ఒకటి – ‘సాహో’ సినిమాకి లింక్ ఉండబోతుందనే టాపిక్, మరొకటి – సినిమాలో పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా కూడా కనిపించబోతున్నాడనే హైప్.

మొదటి కారణం వల్ల ప్రభాస్ ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ కలిసి పండగ చేసుకున్నారు. కానీ అకీరా లేకపోవడం మాత్రం కొంతమందిని నిరాశపరిచింది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/pawan-kalyan-and-director-sujeeth-og-movie-day-1-world-wide-collections/

ఒకవేళ ‘ఓజీ’ లో పవన్ కళ్యాణ్ చిన్ననాటి సీన్స్‌లో అకీరా నటించి ఉంటే, ఫ్యాన్స్ పండగ చేసుకోవడంతో పాటు అకీరాకి కూడా బెస్ట్ డెబ్యూ అయ్యేది. కానీ ఆ ఛాన్స్ మిస్ అయ్యింది. సుజిత్ ఎందుకు ఇలా ఆలోచించలేదో అని ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అకీరా ఆ రోల్ చేశాడంటే థియేటర్స్ మొత్తం బ్లాస్ట్ అయ్యేవి.

అయితే అకీరాకి యాక్టింగ్ కంటే మ్యూజిక్ మీదే ఎక్కువ ఆసక్తి ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ‘ఓజీ’ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో తమన్ కి అకీరా కొంత సహాయం చేశాడని తమన్ చెప్పాడు. అంతేకాదు, గతంలో సోషల్ మీడియాలో కూడా అకీరా ఎక్కువగా మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్‌తోనే కనిపించాడు. ఒకవేళ ఇదే తన అసలైన ఆసక్తి అయితే, అకీరాని స్క్రీన్ మీద చూడాలనుకునే పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆశలు కలగానే మిగిలిపోతాయి.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/sujeeth-missed-a-chance-to-film-with-ram-charan/

ఏదేమైనా, ‘ఓజీ’ లాంటి హైప్ మళ్లీ పవన్ దగ్గర నుంచి లేదా పవన్ ఫ్యాన్స్ నుంచి రావడం కాస్త కష్టమే. మొత్తానికి ఒక మంచి డెబ్యూ ఛాన్స్ అకీరా మిస్ చేసుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఒక్క హోప్ మాత్రం మిగిలి ఉంది. అదేమిటంటే – ‘సాహో’ లింక్ తో ‘ఓజీ పార్ట్ 2’ ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అందులో అకీరా కేమియో చేస్తే ఫ్యాన్స్ కి నిజంగానే పండగ వాతావరణం ఉంటుంది.

SUJITH: ఐతే ప్రస్తుతం డైరెక్టర్ సుజీత్ నెక్స్ట్ నేచురల్ స్టార్ నాని తో సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా కూడా ‘సుజిత్ సినిమాటిక్ యూనివర్స్’ లో భాగం ఏ అని. ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఫిక్స్ అయిపోతున్నారు. మరి ఈ మూవీ రావడానికి ఇంకో రెండు సంవత్సరాలు అయిన పట్టే అవకాశం అయితే ఉంది, మరి చూడాలి, ఈసారి సుజిత్ సంభవం ఏ రేంజ్ లో ఉంటుందో.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad