Thursday, April 3, 2025
Homeచిత్ర ప్రభAkhil: ఘనంగా హీరో అక్కినేని అఖిల్ నిశ్చితార్ధం

Akhil: ఘనంగా హీరో అక్కినేని అఖిల్ నిశ్చితార్ధం

Akhil| అక్కినేని వారి ఇంట వరుస శుభకార్యాలు జరుగుతున్నాయి. ఇప్పటికే నాగార్జున(Nagarajuna) పెద్ద కుమారుడు నాగచైతన్యకు నటి శోభితా దూళిపాళ్లతో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన రెండో కుమారుడు అఖిల్(Akkinenu Akhil) కూడా ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఇరు కుటుంబాల సమక్షంలోనే అఖిల్ నిశ్చితార్థం వేడుక జరిగినట్టు సమాచారం. ఈ విషయాన్ని నాగార్జున సోషల్ మీడియా వేదికగా తెలిపారు. జైనబ్‌ రజ్విడీ (Zainab Ravdjee) తమ కోడలు కాబోతున్నట్లు ఆయన వెల్లడించారు.

- Advertisement -

‘‘జైనబ్‌తో మా కుమారుడి నిశ్చితార్థం జరిగిందని తెలియజేస్తున్నందుకు ఆనందిస్తున్నాం. కోడలిగా జైనబ్‌ను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కాబోయే దంపతులకు మీ ఆశీస్సులు కావాలి’’ అంటూ నాగార్జున పేర్కొన్నారు. అలాగే అఖిల్‌ కూడా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. కాగా ఢిల్లీకి చెందిన జైనబ్‌ థియేటర్‌ ఆర్టిస్ట్‌, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌. ఇదిలా ఉంటే నాగచైతన్య, శోభిత వివాహం డిసెంబర్ 4న జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అయితే అదే రోజు అఖల్ పెళ్లి కూడా జరగనున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News