Nagarjuna 100 Movie: హీరోగా నాగార్జున వందో సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు ఆర్.ఎ.కార్తీక్ దర్శకత్వంలో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఏడాది క్రితం కార్తీక్ కథ చెప్పిన కథ నాగార్జునకు నచ్చటంతో ఆయన దానిపై వర్కవుట్ చేయిస్తూ వచ్చాడు. ఆరేడు నెలలుగా ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరిగి అంతా ఓకే అనుకున్న తర్వాతే సినిమా సెట్స్ పైకి వెళ్లటానికి రెడీ అవుతోంది. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా నాగ్ 100వ సినిమా ఉండబోతోంది. లార్జ్ స్కేల్‌లో సినిమాను తెరకెక్కించబోతున్నారు.
Also Read –Prasanth Varma: ‘హను మాన్’ నిర్మాతతో గొడవపై ప్రశాంత్ వర్మ రియాక్షన్
డైరెక్టర్‌గా కార్తీక్‌కు ఇది మూడో మూవీ. గతంలో నీతాన్ ఒరు వానమ్ అనే తమిళ మూవీకి దర్శకత్వం వహించాడు. అశోక్ సెల్వన్, రీతూవర్మ, శివాత్మిక రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ తెలుగులో ఆకాశం పేరుతో రిలీజైంది. మంచి సినిమాగా పేరొచ్చిన కమర్షియల్‌గా మాత్రం హిట్టవ్వలేదు. ఇక కార్తీక్ రెండో సినిమా మేడిన్ కొరియా. ఇది నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లోనే రిలీజ్ కానుంది. మరి నాగార్జున వంటి కమర్షియల్ హీరోని కొత్త దర్శకుడు ఎలా హ్యాండిల్ చేస్తాడనేది అందరిలో మెదులుతున్న ఆలోచన. నాగార్జున కెరీర్ మైల్ స్టోన్ మూవీ ఇది.
కాగా..ఇందులో ముగ్గురు హీరోయిన్స్ కనిపించబోతున్నారు. అందులో ఒకరు టబు కాగా.. మరో హీరోయిన్ అనుష్క. మూడో ముద్దుగుమ్మగా సుస్మితా భట్ జాయిన్ కానుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. కాగా నాగార్జునకు కోలీవుడ్ డైరెక్టర్లు అంతగా అచ్చిరాలేదు. తమిళ డైరెక్టర్లతో నాగార్జున చేసిన సినిమాల్లో హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువగా ఉన్నాయి. బావనచ్చాడు, స్నేహమంటే ఇదేరా, కృష్ణార్జున, డాన్, గగనం, రక్షకుడు..తో పాటు తమిళ దర్శకులతో నాగార్జున చేసిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఇటీవల రిలీజైన కూలీతో ఈ సెంటిమెంట్ మరోసారి ప్రూవ్ అయ్యింది. మరి ఈ సారి ఏమవుతుందో చూడాలి.
Also Read – Rajasekhar: మానసిక వ్యాధితో బాధపడుతోన్న రాజశేఖర్..


