అక్కినేని నాగచైతన్య, శోభితల వివాహం కొద్దిసేపటి క్రితం జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏర్పాటు చేసిన ఏఎన్నార్ విగ్రహం ముందు వీరి వివాహ తంతు జరిగింది. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తన సంతోషాన్ని ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
“శోభిత, చై కలిసి ఈ అందమైన అధ్యాయాన్ని ప్రారంభించడం నాకు ప్రత్యేకమైన, భావోద్వేగ క్షణం. నా ప్రియమైన చైకి అభినందనలు. అలాగే ప్రియమైన శోభితను కుటుంబంలోకి స్వాగతిస్తున్నాను. మీరు ఇప్పటికే మా జీవితాల్లో చాలా ఆనందాన్ని తెచ్చారు. ANR శతజయంతి సంవత్సరానికి గుర్తుగా స్థాపించబడిన ఆయన విగ్రహం ఆశీర్వాదాల క్రింద ఈ వేడుక జరగడం మరింత ప్రత్యేకంగా ఉంది. ఈ ప్రయాణంలో అడుగడుగునా ఆయన ప్రేమ, మార్గదర్శకత్వం మనతో ఉన్నట్లు అనిపిస్తుంది.
ఈ రోజు మాపై కురిపించిన లెక్కలేనన్ని ఆశీర్వాదాలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అంటూ నాగార్జున ట్వీట్ చేశారు. అలాగే కొన్ని పెళ్లి ఫోటోలు కూడా ఆయన షేర్ చేశారు.