Saturday, November 15, 2025
HomeTop StoriesAkkineni Nagarjuna: సోషల్‌ మీడియాలో ఏఐ వీడియోలు.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కింగ్‌

Akkineni Nagarjuna: సోషల్‌ మీడియాలో ఏఐ వీడియోలు.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కింగ్‌

AI Morphing Akkineni Nagarjuna: ఏఐ సాయంతో త‌న అనుమ‌తి లేకుండా ఫొటోలు, వీడియోలు క్రియేట్ చేస్తున్నార‌ని టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు అక్కినేని నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వాటిని అక్రమంగా వాడుకుంటూ ప‌లు వెబ్‌సైట్స్‌లలో వ్యాపారం చేస్తున్నార‌ని ఆరోపించారు. తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తున్నారని.. ఇలాంటి ప‌నుల‌ను వెంట‌నే ఆపేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హైకోర్టుకు నాగార్జున త‌న పిటిష‌న్‌లో విజ్ఞప్తి చేశారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/cinema-news/alia-bhatt-alpha-first-action-film-controversy-2025/

ఏఐ సాయంతో నాగార్జున‌ పోర్నోగ్రఫీ కంటెంట్‌, లింక్స్‌ క్రియేట్ చేశారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. టీ షర్టులపై ఆయన ఫొటో ముద్రించి బిజినెస్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి ప‌నుల‌పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుని కోరుతూ.. నాగార్జున వ్యక్తిగత హక్కులను కాపాడాలని పిటిషన్‌ వేశారు. అంతేకాకుండా నాగార్జున ఏఐ వీడియోలు క్రియేట్ చేసిన దాదాపు 14 వెబ్‌సైట్స్‌ని వాటికి సంబంధించిన లింక్స్‌ని తొలగించాల‌ని న్యాయవాది డిమాండ్ చేశారు. 

కొన్ని వెబ్‌సైట్‌లు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి అక్కినేని నాగార్జున ప్రతిష్ఠ‌కు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నాయి. నాగార్జున ఫొటోలతో అశ్లీల (పోర్నోగ్రఫీ) కంటెంట్, అనుమానాస్పద లింకులను సృష్టించి ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా, ఆయన ఫొటోలను టీషర్టులపై ముద్రించి ఆన్‌లైన్‌లో విక్రయిస్తూ అక్రమంగా వ్యాపారం చేస్తున్నారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న సుమారు 14 వెబ్‌సైట్‌లను గుర్తించాం. వాటిని, వాటికి సంబంధించిన లింకులను తక్షణమే ఇంటర్నెట్ నుంచి తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలి.’ అని పిటిషన్‌లో డిమాండ్‌ చేశారు. 

Also Read: https://teluguprabha.net/cinema-news/og-director-confirms-sujeeth-cinematic-universe-on-og-release-day/

కాగా, గతంలో బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ కూడా ఇలాంటి సమస్యపైనే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయాన్ని ఈ సందర్భంగా న్యాయవాది గుర్తుచేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. నాగార్జున లేవనెత్తిన అంశాలను తీవ్రంగా పరిగణించింది. ఆయన వ్యక్తిగత హక్కులను కాపాడతామని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఏఐ టెక్నాలజీ వల్ల సెలబ్రిటీలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ కేసు మరో ఉదాహరణ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad