Thursday, September 19, 2024
Homeచిత్ర ప్రభAlia Bhatt: కుతూరుకి పేరుపెట్టిన అలియా.. ఈ పేరు అర్ధమేంటో తెలుసా?

Alia Bhatt: కుతూరుకి పేరుపెట్టిన అలియా.. ఈ పేరు అర్ధమేంటో తెలుసా?

Alia Bhatt: బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన అలియా భట్, రణ్ బీర్ కపూర్ లకు పండంటి ఆడపిల్ల జన్మించిన సంగతి తెలిసిందే. అలియా భట్ నుండి పాప పుట్టిందనే వార్తతో ఎంతో సంతోషించిన అభిమానులు.. అప్పటి నుండి సోషల్ మీడియా వేదికగా ఈ జంటకి శుభాకాంక్షలు చెప్తూ వస్తున్నారు. కాగా, ఇప్పుడు ఆ బిడ్డకు నామకరణం కూడా చేశారు. సోషల్ మీడియా ద్వారా తన బిడ్డ పేరు.. దానికి అర్ధం చెప్తూ అలియా తెగ మురిసిపోయింది.

- Advertisement -

తన ముద్దుల కూతురికి రహా అనే పేరు నిర్ణయించినట్లు అలియా భట్ తన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలిపింది. అంతే కాదు రహా అనే పేరుకి గల అర్ధాన్ని కూడా ఆమె తెలియజేస్తూ పోస్ట్ చేసింది. రహా అంటే అద్భుతం, ఆనందం, ఆహ్లాదం అని చెప్పిన అలియా తను రాకతో మా ఇల్లు ఒక్కసారిగా మరింత గొప్పగా మారిపోయిందని చెప్పింది. అలియా భట్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, అలియా భట్ త్వరలో కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు చేయనున్నట్లు తెలుస్తోంది. కెరీర్ కు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న అలియా.. ఆయా సినిమాలు కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తుండడంతో సాధ్యమైనంత త్వరగా మళ్ళీ కామ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తుందట. త్వరలోనే అలియా నుండి కొత్త సినిమాలపై ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News