Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభTollywood Movies: హద్దులు దాటేస్తోన్న తెలుగు సినిమాలు

Tollywood Movies: హద్దులు దాటేస్తోన్న తెలుగు సినిమాలు

Tollywood Movies: తెలుగు సినిమా హద్దులు దాటేస్తుంది.. బౌండరీస్‌ను దాటేయటమే కాదండోయ్ రికార్డులను క్రియేట్ చేస్తూ అందరూ టాలీవుడ్ వైపు చూస్తున్నారు. ఇప్పుడు మన స్టార్స్, టెక్నీషియన్స్ అందరూ పాన్ వరల్డ్ సినిమాలపై కన్నేశారు. భారీ బడ్జెట్స్, వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో భారీ సినిమాలు రూపొందుతున్నాయి. ఇంతకీ ఏంటా సినిమాలు.. ఎవరా స్టార్స్ అనే వివరాలపై ఓ లుక్కేద్దాం…

- Advertisement -

తెలుగు సినిమా ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా పీక్ స్టేజ్‌లో ఉంది. ఒకప్పుడు మన సినిమాలు దేశంలో గుర్తింపు పొందితే చాలనుకుంటే, ఇప్పుడు మాత్రం ప్రపంచమే తన వైపు చూసుకునేలా తెలుగు సినిమా చేస్తోంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఇప్పుడు పాన్ ఇండియా అనే మాటను దాటి, అంతకంటే పెద్దదైన విజన్‌ మీద పని చేస్తున్నారు. మన సినిమాలు విదేశాల్లోనూ పేరు తెచ్చుకోవాలి అనేది ఇప్పుడు సాధారణ ఆలోచన అయింది. ఇదంతా కేవలం మాటలు కాదు.. చాలామంది పెద్ద సినిమాలు తీసే పనిలో పడ్డారు. నిజంగా చెప్పాలంటే, ఇప్పుడు తెలుగు సినిమా గర్వించదగ్గ దశలో ఉంది.

రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులు ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో ఆలోచిస్తున్నారు. వాళ్లకు ఇప్పుడు ప్రపంచం వీరి టార్గెట్. వీళ్ల దృష్టిలో ప్రపంచ ప్రేక్షకులు ఉన్నారు, వాళ్లకు నచ్చేలా కథలు, సినిమాలు రూపొందిస్తున్నారు. మన హీరోలు కూడా ఈ స్థాయికి తగినట్టు తమను తాము సిద్ధం చేసుకుంటున్నారు. ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచానికి మన సినిమా శక్తిని చూపిన రాజమౌళి గారు, ఇప్పుడు మరింత పెద్ద స్థాయిలో SSMB29 అనే సినిమా చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ సినిమా ను 120 దేశాల్లో, 26 భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంతే కాకుండా, నవంబర్‌లో ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ చేత రిలీజ్ చేయించాలని చూస్తున్నారని సమాచారం. ఇది జరిగితే, తెలుగు సినిమాకి గ్లోబల్ స్థాయిలో కొత్త చరిత్ర మొదలవుతుంది.

Also Read – Salman Khan: బిగ్‌బాస్‌లో పాలిటిక్స్‌.. స‌ల్మాన్ కామెంట్స్ ట్రంప్‌కేనా?

‘పుష్ప 2’ తో ఇప్పటికే దేశంలో రికార్డులు తిరగరాస్తున్న అల్లు అర్జున్, ఇప్పుడు డైరెక్టర్ అట్లీతో కలిసి ప్రపంచ స్థాయిని లక్ష్యంగా పెట్టుకున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమా తీరుతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇక నాని నటిస్తున్న ‘పారడైస్’ కూడా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గానే రూపొందుతున్నదని నిర్మాతలు చెబుతున్నారు. మరోవైపు ప్రభాస్, సందీప్ వంగ కాంబినేషన్‌లో రానున్న ‘స్పిరిట్’ సినిమా, ఓ డార్క్ నేచురల్ పోలీస్ డ్రామా. ఇందులో కొరియన్ నటుడు డాంగ్లీ నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ అంతర్జాతీయ స్థాయిలో భారీగా తెరకెక్కుతోంది

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న ‘డ్రాగన్ రేజ్’ అనే చిత్రం కూడా పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందించాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు, ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘జై హనుమాన్’ సినిమా 11కి పైగా భాషల్లో విడుదల కాబోతోంది. ఇందులో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్స్ చూస్తుంటే, తెలుగు సినిమా ఇకపై కేవలం తెలుగువారికే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులకు ప్రత్యేక అనుభూతిని ఇవ్వబోతోంది. మన దర్శకులు అంతర్జాతీయంగా ఆలోచిస్తున్నారు, మన హీరోలు అన్ని స్థాయిలకు తగినట్టు తమను తాము తీర్చిదిద్దుకుంటున్నారు. భారీ బడ్జెట్‌లు, విదేశీ టెక్నికల్ బృందాలతో కలసి పనిచేయడం మొదలైంది.

Also Read – Rajamouli: రాజమౌళికే పోటీగా..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad