అల్లరి నరేశ్ (Allari Naresh) ఇటీవల ‘బచ్చలమల్లి’ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా మరో కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌ను మేకర్స్ వెల్లడించారు. పొలిమేర-1, పొలిమేర-2 రైటర్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు కథ అందించగా.. నాని కాసరగడ్డ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా మూవీ టీజర్ మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీకి ’12 ఎ రైల్వే కాలనీ’(12A Railway Colony) అనే పేరు పెట్టారు. ఈ టీజర్‌లో “ఆత్మలు కొందరికే ఎందుకు కనిపిస్తాయిరా”.. “ప్రాణాలతో బయటకు పోవుడు అవసరం లేదు” అనే డైలాగులతో సినిమాపై ఆసక్తి పెంచారు.
ఇక ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటిస్తోంది. సాయికుమార్, వైవా హర్ష, సద్దాం, జీవన్ లాంటి వారు కీలక పాత్రలు చేస్తున్నారు. దెయ్యాలు, చేతబడి నేపథ్యంలో సినిమా తెరకెక్కిస్తున్నారని టీజర్ చూస్తుంటే తెలుస్తోంది.