Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభAllu Aravind: స్టేజి మీద అల్లు అరవింద్ డ్యాన్స్.. వీడియో వైరల్

Allu Aravind: స్టేజి మీద అల్లు అరవింద్ డ్యాన్స్.. వీడియో వైరల్

నాగ చైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) నటించిన ‘తండేల్’ (Thandel)సినిమా నుంచి మూడో పాటను గురువారం మేకర్స్ రిలీజ్ చేశారు. ‘ఎంతెంత దూరాన్ని నువ్వు, నేను మోస్తూ ఉన్న అసలింత అలుపే రాదు.. ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్న కాస్త అయినా అడ్డే కాదు..హైలెస్సా’ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ ఓ కాలేజీలో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) స్టేజిపై సరదాగా స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

ఇప్పటికే విడుదలైన ‘బుజ్జి తల్లి’, ‘నమో నమః శివాయ’ అంటూ సాగే రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘హైలెస్సో హైలెస్సా’ పాటకు దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేయగా.. శ్రీమణి సాహిత్య అందించారు. బాలీవుడ్ సింగర్స్ నకాష్ ఆజీజ్, శ్రేయా ఘోషల్ ఈ పాటను అద్భుతంగా పాడారు. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. కాగా శ్రీకాకుళం మత్స్యకారుల జీవితం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు సినిమాపై అంచనాలు పెంచేలా చేశాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad