Allu Aravind: అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ మూవీ సరైనోడుకు సీక్వెల్ రానున్నట్లు చాలా కాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్‌పై ది గర్ల్‌ఫ్రెండ్ ప్రెస్‌మీట్‌లో నిర్మాత అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. సినిమా నిర్మాణానికి దూరం కావడానికి గల కారణాలపై అల్లు అరవింద్ రియాక్ట్ అయ్యారు.
అల్లు అర్జున్‌తో సరైనోడు 2 తీస్తే ఖచ్చితంగా ఈ సీక్వెల్‌ను గీతా ఆర్ట్స్‌లోనే చేస్తామని అల్లు అరవింద్ అన్నారు. 400 నుంచి 500 కోట్ల వరకు ఖర్చు పెట్టి అల్లు అర్జున్, రామ్‌చరణ్‌లతో సినిమాలు తీయాలని ఉంది. ఆ సినిమాలు తీసినందుకు ఇద్దరికి రెమ్యూనరేషన్ ఇస్తే అది తిరిగి మా ఇంటికే వస్తుంది. బయటి ప్రొడ్యూసర్లతో సినిమాలు చేసినా రెమ్యూనరేషన్ మా ఇంటికే వస్తుంది. నాది నేను ఇచ్చుకోవడం కంటే బయటి వాళ్ల డబ్బులు తీసుకుంటే బాగుంటుందని సినిమా ప్రొడక్షన్‌కు దూరంగా ఉంటున్నానని అల్లు అరవింద్ అన్నారు.
Also Read – Rashmika Mandanna: మగవాళ్లకి ఒకసారైనా పీరియడ్స్ బాధేంటో తెలియాలి.. రష్మిక కామెంట్స్ వైరల్
అల్లు అరవింద్ కామెంట్స్‌తో మరోసారి సరైనోడు సీక్వెల్ తెరపైకి వచ్చింది. అఖండ 2 తర్వాత బోయపాటి చేయబోయే నెక్స్ట్ సినిమా సరైనోడు సీక్వెల్ కావచ్చునని ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 2016లో రిలీజైన సరైనోడు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో బన్నీ ఎలివేషన్లు, హీరోయిజం అభిమానులను ఆకట్టుకున్నాయి. యాభై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 120 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
మరోవైపు పుష్ప 2 తర్వాత బన్నీకి పాన్ ఇండియన్ లెవెల్‌లో క్రేజ్ ఏర్పడింది. అతడితో సినిమాలు చేసేందుకు బాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన టాప్ డైరెక్టర్లు రెడీగా ఉన్నారు. వారందరిని పక్కనపెట్టి బోయపాటి శ్రీను సినిమాకు బన్నీ గ్రీన్‌సిగ్నల్ ఇస్తాడా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అట్లీతో ఓ సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీని 850 కోట్ల బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. అల్లు అర్జున్, అట్లీ మూవీలో నలుగురు హీరోయిన్లు నటించనున్నారు. ఇప్పటికే దీపికా పదుకొనె, మృణాల్ ఠాకూర్‌ను ఫైనల్ చేశారు. రష్మిక మందన్న, జాన్వీకపూర్ ఇతర నాయికలుగా నటించబోతున్నట్లు టాక్. ఇండియన్ లాంగ్వేజెస్‌తో పాటు ఇంగ్లీష్‌లో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు టాక్. 2027లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read – Modi: మోదీని కలిసిన ఉమెన్స్ క్రికెట్ టీమ్..ఎప్పుడంటే!


