Allu Kanakaratnam-Chiranjeevi:టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి కనకరత్నమ్మ శనివారం తెల్లవారుజామున తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. వయసు 94 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె వైద్య చికిత్స తీసుకుంటూ ఉన్నప్పటికీ, ఆరోగ్యం మరింత క్షీణించడం వల్ల ఈ ఉదయం కన్నుమూశారు.
కోకాపేటలోని ఫామ్‌హౌస్‌లో…
కనకరత్నమ్మ, దివంగత నటుడు అల్లు రామలింగయ్య సతీమణి. తెలుగు సినీ ప్రపంచంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న అల్లు కుటుంబం ఈ విషాదంలో మునిగిపోయింది. తల్లి మృతితో అల్లు అరవింద్ శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె అంత్యక్రియలు కోకాపేటలోని కుటుంబ ఫామ్‌హౌస్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ ఘటనతో టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు, సన్నిహితులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఉదయం అల్లు అరవింద్ ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయనతో పాటు తన కుమారుడు రామ్ చరణ్ కూడా అక్కడే ఉండి, అంత్యక్రియల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
— Bunny_boy_private (@Bunnyboiprivate) August 30, 2025
సోషల్ మీడియాలో కూడా…
కనకరత్నమ్మ మృతదేహాన్ని పార్థివదేహం తీసుకువెళ్తున్న సమయంలో చిరంజీవి తన అత్తగారి పాడె మోసారు. ఆయనతో పాటు అల్లు అర్జున్ కూడా పాడెను మోశారు. సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు అనేక మంది ప్రముఖులు అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు. సోషల్ మీడియాలో కూడా పలువురు సినీ తారలు, అభిమానులు ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మెగా కుటుంబంతో పాటు టాలీవుడ్ మొత్తానికి ఇది ఒక బాధాకరమైన సందర్భమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
కోకాపేటలోని ఫామ్‌హౌస్…
అంత్యక్రియలు కోకాపేటలోని ఫామ్‌హౌస్‌లో సాయంత్రం జరగనున్నాయి. ఈ సందర్భానికి సినీ, రాజకీయ రంగాల నుంచి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. కనకరత్నమ్మను చివరి సారి చూసేందుకు బంధువులు, అభిమానులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు.
Also Read: https://teluguprabha.net/gallery/kajal-aggarwal-shares-maldives-vacation-photos-with-husband/


