తన అభిమానులకు హీరో అల్లు అర్జున్(Allu Arjun) స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. ఇకపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఎవరినీ వ్యక్తితంగా కించపరిచే విధంగా పోస్టులు చేయవద్దని విన్నవించారు. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ఐడీ, ప్రొఫైల్స్‌తో పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నెగటివ్ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా ఉండాలని అభిమానులకు సూచిస్తున్నాను అంటూ ఓ ప్రకటనలో తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
