Allu Arjun- Atlee Movie: అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమా AA22xA6 పేరిట తెరకెక్కుతోంది. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటిస్తుండగా.. భారీ అంచనాలతో ఈ మూవీ షూటింగ్ నడుస్తోంది.
కాగా, ఇటీవలే ఈ సినిమా ముంబయిలో కీలకమైన షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. తరువాత తదుపరి షెడ్యూల్ కోసం అబూదాబీలో కొత్త లొకేషన్లను వెతికే పనిలో ఉంది. అందుకు సంబంధించిన షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం.
#AA22 pic.twitter.com/vEoaLM6mld
— C/o.AlluArjun (@CareOfAlluArjun) September 29, 2025
అయితే ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ కోసం పనిచేసిన జపాన్-బ్రిటీష్ డాన్సర్, కొరియోగ్రాఫర్ హోకుటో కోనిషి ఇటీవల తన సోషల్ మీడియా ద్వారా ‘బిహైండ్ ద సీన్స్’ ఫోటోలు షేర్ చేశాడు. ఈ ఫొటోల్లో అల్లు అర్జున్, అట్లీతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన హోకుటో.. ఈ ప్రాజెక్టులో పనిచేయడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు.
Also Read: https://teluguprabha.net/cinema-news/what-is-the-real-reasons-for-the-drop-in-og-collections/
Sun Pictures పతాకంపై ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. మ్యూజిక్ డైరెక్ట్‌ర్‌గా సాయి అభ్యంకర్ పనిచేస్తున్నారు. నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో చిత్రబృందం వెల్లడించనుంది.


