Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభAllu Arha: నువ్వు తెలుగేనా - మంచి ల‌క్ష్మికి షాకిచ్చిన అల్లు అర్జున్ కూతురు -...

Allu Arha: నువ్వు తెలుగేనా – మంచి ల‌క్ష్మికి షాకిచ్చిన అల్లు అర్జున్ కూతురు – వైర‌ల్ అవుతున్న వీడియో

Allu Arha: మంచు ల‌క్ష్మికి అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ నుంచి ఊహించిన ప్ర‌శ్న ఎదురైంది. మంచు ల‌క్ష్మి యాస తెలుగులా లేదంటూ ఆమెను ఆట‌ప‌ట్టించింది అర్హ‌. అల్లు అర్జున్ కూతురు అర్హ‌కు సోష‌ల్ మీడియాలో చాలానే ఫాలోయింగ్ ఉంది. త‌న ముద్దుముద్దు మాట‌ల‌తో అర్హ చేసే అల్ల‌రి ప‌నుల‌ను త‌ర‌చుగా సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంటుంటారు అల్లు అర్జున్ తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి స్నేహారెడ్డి. అచ్చ తెలుగులో మాట్లాడుతూ నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటుంది అర్హ‌.

- Advertisement -

Also Read- Tollywood: నాలుగో రోజు కొన‌సాగుతున్న సినీ కార్మికుల స‌మ్మె – చిరంజీవి మాట‌కు క‌ట్టుబ‌డి ఉంటామ‌న్న ఫెడ‌రేష‌న్ ప్రెసిడెంట్‌

నువ్వు తెలుగేనా…
తాజాగా అల్లు అర్జున్ ఇంటికి మంచు ల‌క్ష్మి వ‌చ్చింది. ఆమెను యాక్సెంట్‌ను అర్హ ఆట‌ ప‌ట్టించిన వీడియోను స్నేహా రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. నువ్వు న‌న్ను ఏదో అడ‌గాల‌నుకున్నావంట ఏంట‌ది అని అర్హ‌ను మంచు ల‌క్ష్మి అడిగింది. నువ్వు తెలుగేనా అని మంచు ల‌క్ష్మితో అర్హ అన్న‌ది.
నేనే తెలుగే…నీకు ఎందుకు ఆ డౌట్ వ‌చ్చింది. నీతో తెలుగులోనే మాట్లాడుతున్నా క‌దా అంటూ అర్హ ప్ర‌శ్న‌కు మంచు ల‌క్ష్మి బ‌దులిచ్చింది. అర్హ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్ విని అల్లు అర్జున్ న‌వ్వుతూనే ఎందుక‌లా అడిగావ‌ని కూతురితో అన్నారు. నీ యాక్సెంట్ అలా ఉంది అని మంచు ల‌క్ష్మితో అర్హ ముద్దుముద్దుగా అన్న‌ది. ఆమె మాట‌ల‌తో మంచు ల‌క్ష్మితో పాటు బ‌న్నీ తెగ న‌వ్వుకున్నారు. అర్హ‌, మంచు ల‌క్ష్మి వీడియో వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

ఫారిన్ యాస‌…
మంచు ల‌క్ష్మి అమెరికాలోనే పెర‌గ‌డంతో ఆమె తెలుగు భాష‌లో ఫారిన్ యాస క‌నిపిస్తుంది. మంచు ల‌క్ష్మి యాక్సెంట్‌పై గ‌తంలో చాలా ట్రోల్స్ వ‌చ్చాయి. కానీ వాటిని పాజిటివ్‌గానే తీసుకున్న‌ది మంచు ల‌క్ష్మి. ఇదే యాస‌ను కంటిన్యూ చేస్తోంది.

Also Read- Varalakshmi Vratam: వరలక్ష్మి వ్రతం రోజు మీ రాశి ప్రకారం..ఏ రూల్స్‌ ఫాలో అవ్వాలంటే..

ద‌క్ష రిలీజ్‌కు రెడీ…
తెలుగులో ప‌లు సినిమాల్లో హీరోయిన్‌గానే కాకుండా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్స్‌లో మంచు ల‌క్ష్మి క‌నిపించింది. గుండెల్లో గోదారి, దొంగాట‌, వైఫ్ ఆఫ్ రామ్‌, గుంటూరు టాకీస్ సినిమాలు మంచు ల‌క్ష్మికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. గ‌త ఏడాది రిలీజైన ఆదిప‌ర్వం మూవీలో విల‌న్‌గా న‌టించింది.
తండ్రి మోహ‌న్‌బాబుతో క‌లిసి మంచు ల‌క్ష్మి న‌టించిన ద‌క్ష మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad