హీరో అల్లు అర్జున్(Allu Arjun) భార్య స్నేహ రెడ్డి(Sneha Reddy) తన ఫ్యామిలీ ఫొటోలను సోషల్ మీడియా షేర్ చేసుకున్నారు. ఈ ఫొటోల్లో అల్లు అర్జున్, పిల్లలు అయాన్, అర్హ ఉన్నారు. అందరూ ఒక్కటే వైట్ డ్రెస్ వేసుకుని ఉన్న ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.
- Advertisement -
ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే ఇటీవల ‘పుష్ప2’ మూవీతో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. ‘బాహుబలి2’ కలెక్షన్లను బ్రేక్ చేసి చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1900కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డు నెలకొల్పింది. త్వరలోనే రూ.2000కోట్లు వసూళ్లు రాబట్టే దిశగా ముందుకెళ్తోంది. ఇదిలా ఉంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తన తర్వాతి సినిమాను చేయనున్నారు.