Allu Arjun: పుష్ప, పుష్ప 2 బ్లాక్‌బస్టర్స్‌తో బన్నీ పేరు పాన్ ఇండియన్ లెవెల్‌లో మారుమోగింది. టాలీవుడ్, బాలీవుడ్‌తో అన్ని భాషల్లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి. పుష్ప 2 ఇండియన్ సినిమా హిస్టరీలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. పుష్ప 2 బ్లాక్‌బస్టర్‌తో బన్నీని దృష్టిలో పెట్టుకొని వివిధ భాషలకు చెందిన టాప్ డైరెక్టర్లు కథలు సిద్ధం చేస్తున్నారు.
ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. 850 కోట్ల బడ్జెట్‌తో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఆరంభం నుంచే దేశవ్యాప్తంగా సినీ లవర్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సైంటిఫిక్ యాక్షన్ మూవీలో దీపికా పదుకొనెతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీకపూర్, రష్మిక మందన్న హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Also Read- IND vs AUS 4th T20I: భారత్-ఆస్ట్రేలియా నాలుగో టీ20 నేడే.. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
అట్లీ మూవీ పూర్తికావడానికి మరో ఏడాదిపైనే టైమ్ పట్టేలా ఉంది. 2027లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అట్లీ ప్రాజెక్ట్ పూర్తికాకుండానే బన్నీ మరికొన్ని పాన్ ఇండియన్ సినిమాలను లైన్‌లో పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. అట్లీ మూవీ తర్వాత స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీలో బన్నీ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ భారీ బడ్జెట్ మూవీకి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. బన్నీ, బన్సాలీ కాంబో కోసం అభిమానులు చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. 2026లో ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం. అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సరైనోడు 2 కూడా రాబోతుంది. గీతా ఆర్ట్స్‌లోనే ఈ సీక్వెల్ ఉండబోతున్నట్లు అల్లు అరవింద్ ఇటీవల ప్రకటించారు. అఖండ 2 తర్వాత బోయపాటి శ్రీను ఈ సీక్వెల్‌పై ఫోకస్ పెట్టనున్నట్లు చెబుతున్నారు.
ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రభాస్‌తో పాటు టాలీవుడ్ హీరోలందరితో రాజమౌళి సినిమాలు చేశారు. ఒక్క అల్లు అర్జున్ మాత్రమే బ్యాలెన్స్‌గా ఉన్నాడు. ఈ సెన్సేషనల్ కాంబోలో సినిమా ఎప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్, రాజమౌళి మధ్య ఓ సినిమా కమిట్‌మెంట్ ఉంది. సలార్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో అల్లు అర్జున్ ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఈ కాంబినేషన్‌ను దిల్ రాజు సెట్ చేశారు. అట్లీ మూవీ కంటే ముందే బన్నీ, ప్రశాంత్ నీల్ మూవీ మొదలుకావాల్సింది. అప్పటికే ప్రశాంత్ నీల్ డ్రాగన్ అంగీకరించడంతో బన్నీ సినిమా ఆలస్యమైంది.
Also Read- Sudheer Babu: గర్ల్‌ఫ్రెండ్ డైరెక్టర్‌తో సుధీర్‌బాబు మూవీ ఫిక్స్ – అనౌన్స్‌మెంట్ ఎప్పుడంటే?
ఈ దర్శకులతోనే కాకుండా కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగాలతో బన్నీ సినిమాలు చేయనున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. సందీప్ రెడ్డి వంగాతో సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది.


