Telugu Heroes Remuneration: సినిమాల బడ్జెట్‌లో హీరోల రెమ్యూనరేషన్ల వాటానే అధికంగా ఉంటుంది. హీరోల రెమ్యూనరేషన్లపై ఫ్యాన్స్‌లో ఇంట్రెస్ట్ ఎక్కువగానే కనిపిస్తుంటుంది. ఓ సినిమా కోసం హీరో ఇన్ని కోట్లు తీసుకుంటున్నాడు.. అంత డిమాండ్ చేస్తున్నాడంటూ ఎప్పుడూ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఒకప్పుడు పది కోట్ల వరకు ఉన్న రెమ్యూనరేషన్లు ఇప్పుడు వందల కోట్లకు చేరుకున్నాయి. ఒక్కో సినిమాకు స్టార్ హీరోలు వంద కోట్లకుపైనే రెమ్యూనరేషన్లు అందుకుంటున్నారు.
ప్రాఫిట్స్‌లో షేర్…
టాలీవుడ్‌లో హీరోల రెమ్యూనరేషన్లు గట్టిగానే ఉన్నాయి. స్టార్ హీరోల రెమ్యూనరేషన్ల కారణంగానే సినిమాల నిర్మాణవ్యయాలు పెరుగుతున్నాయనే విమర్శలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. నిర్మాతలు నష్టపోవడానికి హీరోల రెమ్యూనరేషన్లే కారణమనే వాదనలు నానాటికి పెరుగుతున్నాయి. ఈ విమర్శల నేపథ్యంలో హీరోలు రెమ్యూనరేషన్ల విషయంలో తగ్గుతున్నారు. రెమ్యూనరేషన్లకు బదులుగా ప్రాఫిట్స్‌లో షేర్, లేదంటే థియేట్రికల్, శాటిలైట్, ఓటీటీ హక్కుల్లో వాటాలు తీసుకుంటూ సినిమాలను అంగీకరిస్తున్నారు కాగా టాలీవుడ్‌లో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్న హీరోల లిస్ట్‌లో అల్లు అర్జున్, ప్రభాస్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు. పుష్ప 2 మూవీ కోసం అల్లు అర్జున్ ఏకంగా రెండు వందల కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. రెమ్యూనరేషన్‌తో పాటు ప్రాఫిట్స్‌లో షేర్ తీసుకునే విధానంలో అల్లు అర్జున్ ఈ సినిమా చేశాడట. పుష్ప2 తో టాలీవుడ్‌లో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేసినట్లు సమాచారం.
Also Read – Janhvi Kapoor: కృష్ణాష్టమి వేడుకలపై ట్రోల్స్ – ఇచ్చిపడేసిన జాన్వీకపూర్
ప్రభాస్ సెకండ్ ప్లేస్…
అల్లు అర్జున్ తర్వాత రెమ్యూనరేషన్స్‌లో ప్రభాస్ సెకండ్ ప్లేస్‌లో కొనసాగుతోన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు చెబుతోన్నారు. ప్రభాస్‌కు పాన్ ఇండియన్ లెవెల్‌లో ఉన్న క్రేజ్ దృష్ట్యా అతడు డిమాండ్ చేసినంత మొత్తాన్ని ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉంటున్నారు. వంద కోట్ల కంటే ఎక్కువ పారితోషికం అందుకుంటున్న టాలీవుడ్ హీరోల లిస్ట్‌లో అల్లు అర్జున్, ప్రభాస్.. ఇద్దరు మాత్రమే ఉన్నారు.
ఆర్ఆర్ఆర్ హీరోలు…
ఆర్ఆర్ఆర్ హీరోల్లో ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు 75 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుండగా.. రామ్‌చరణ్ 70 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్, మహేష్‌బాబు తమ సినిమాల కోసం యాభై కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారట
సీనియర్ హీరోల్లో చిరంజీవి టాప్…
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒక్క చిరంజీవి మాత్రమే ఒక్కో సినిమాకు నలభై నుంచి నలభై ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్‌ను స్వీకరిస్తున్నట్లు సమాచారం. మెగాస్టార్‌కు దరిదాపుల్లో కూడా మిగిలిన హీరోలు లేరు. చిరంజీవి తర్వాత బాలకృష్ణ రెండో ప్లేస్‌లో ఉన్నాడు. అఖండ 2 మూవీ కోసం బాలకృష్ణ 22 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతోన్నాయి. వెంకటేష్, నాగార్జున పది కోట్ల లోపే పారితోషికాలను అందుకుంటున్నారు.
ముగ్గురే హీరోలు…
పది నుంచి ఇరవై కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న లిస్ట్‌లో ముగ్గురే టాలీవుడ్ హీరోలు ఉన్నారు. రవితేజ (పద్దెనిమిది కోట్లు) నాని (పదిహేను కోట్లు), విజయ్ దేవరకొండ (పన్నెండు కోట్లు) మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. మిగిలిన హీరోలంతా పది కోట్ల కంటే తక్కువే రెమ్యూనరేషన్ సొంతం చేసుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతోన్నాయి.


