ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తన బంధువుల పెళ్లికి హాజరయ్యారు. భార్య స్నేహరెడ్డి, కుమార్తె అర్హతో కలిసి ఆ వేడుకకు వెళ్లారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బన్నీ లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా ఇటీవల ‘పుష్ప 2’ మూవీతో బ్లాక్‌బాస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి చరిత్ర సృష్టించింది. ఈ సినిమా తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో హాలీవుడ్ రేంజ్ మూవీ చేయబోతున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్ మీద రూ.800కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.