Pushpa2 Trailer| ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప2’(Pushpa2). స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప మూవీతో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ జాతీయ అవార్డు అందుకోవడంతో పుష్ప2 మూవీ కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా విడుదలకు సరిగ్గా నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో మేకర్స్ వినూత్న రీతిలో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈమేరకు కొత్త పోస్టర్లు విడుదల చేశారు. ఓ పోస్టర్లో పుష్పరాజ్ (అల్లు అర్జున్), భన్వర్‌సింగ్ షెకావత్ (ఫహద్ ఫాజిల్) ఎదురెదురుగా నిలబడి ఉన్నారు. అంతేకాదు త్వరలోనే ట్రైలర్‌ను(pushpa2 trailer) కూడా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
మరోవైపు అమెరికాలోని థియేటర్స్‌లో వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ‘పుష్ప’ బ్రాండ్ పాప్‌కార్న్ టబ్స్, కూల్ డ్రింక్స్ క్యాన్స్ అమెరికాలోని అన్ని థియేటర్స్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నవంబరు 13వ తేదీ నుంచి సూర్య ‘కంగువా’ ప్రీమియర్స్‌తో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకూ ఏ భారతీయ చిత్రమూ ఇలాంటి వినూత్న ప్రమోషన్ చేయలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్స్‌లో విడుదల చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో 11,500 స్క్రీన్స్‌ల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇండియాలో 6,500.. ఓవర్సీస్లో 5000 స్క్రీన్స్‌లో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా ఈ స్థాయిలో విడుదల కాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో బిగ్గెస్ట్ రిలీజ్ ఇండియన్ సినిమాగా ‘పుష్ప2’ రికార్డు సృష్టించనుంది. దీంతో ఈ చిత్రం కలెక్షన్లలోనూ సరికొత్త రికార్డులు నెలకొల్పనుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీ స్పెషల్ సాంగ్ షూటింగ్ కూడా త్వరలోనే పూర్తి చేయనుంది. దర్శకుడు సుకుమార్-దేవిశ్రీ కాంబినేషన్లో ఐటమ్ సాంగ్‌లు ఎవర్ గ్రీన్ తెలిసిందే. ఈ సాంగ్ కోసం హీరోయిన్ శ్రీలీల రంగంలోకి దిగనున్నట్లు టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.