Allu Sirish – Nayanika: అల్లు శిరీష్, నయనిక ఎంగేజ్‌మెంట్ ఇటీవల గ్రాండ్‌గా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు అల్లు, మెగా ఫ్యామిలీ హీరోలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. మరికొందరు టాలీవుడ్ హీరోలు ఈ వేడుకకు అటెండ్ అయ్యారు. శిరీష్, నయనిక ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంగేజ్‌మెంట్ వేడుక తాలూకు వీడియోను అభిమానులతో పంచుకున్నది అల్లు ఫ్యామిలీ.
ఈ వేడుకలో తమ లవ్ స్టోరీని అల్లు శిరీష్‌తో పాటు నయనిక ఇద్దరూ బయటపెట్టారు. హీరోలు వరుణ్‌తేజ్, నితిన్ వల్లే నయనికను మొదటిసారి కలుసుకున్నట్లు శిరీష్ చెప్పాడు. “2023 అక్టోబర్‌లో వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి ముందు వారికి హీరో నితిన్, అతడి భార్య షాలిని స్పెషల్ పార్టీ ఇచ్చారు. ఆ పార్టీకి షాలిని బెస్ట్ ఫ్రెండ్ నయనిక వచ్చింది. అప్పుడే నయనికను మొదటిసారి చూశా. ఆ పార్టీలో మా మధ్య పరిచయం మొదలైంది. రెండేళ్లలో ప్రేమలో పడ్డాం. ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాం” అని శిరీష్ అన్నాడు. శిరీష్ ది ఫ్రెండ్లీ నేచర్ అని, చాలా కేరింగ్‌గా చూసుకుంటాడని అవే అతడిలో తనకు బాగా నచ్చిన క్వాలిటీస్ అని నయనిక అన్నది.
Also Read – Peddi : మెగా పవర్ స్టార్ ‘పెద్ది’ మ్యూజికల్ ట్రీట్ ‘చికిరి చికిరి’ వస్తోంది!
తమ లవ్‌స్టోరీ విషయంలో ఎలాంటి రూమర్స్‌కు తావు లేకుండా ముందే ఈ జంట బయటపెట్టారు. పెళ్లి తేదీని మాత్రం ఈ జంట వెల్లడించలేదు. వచ్చే ఏడాది ఆరంభంలో శిరీష్, నయనిక పెళ్లి జరుగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నయనికకు షాలినితో పాటు రానా భార్య మిహీకా బజాజ్ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్ అని టాక్ వినిపిస్తోంది. అల్లు శిరీష్, నయనిక ఎంగేజ్‌మెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జంట చూడముచ్చటగా ఉన్నారని ఫ్యాన్స్ చెబుతున్నారు. కాగా శిరీష్, నయనిక ఎంగేజ్‌మెంట్‌కు చిరంజీవి, రామ్‌చరణ్‌తో పాటు మెగా హీరోలందరూ అటెండ్ అయ్యారు. పొలిటికల్ వ్యవహారాలతో బిజీగా ఉండటంతో పవన్ కళ్యాణ్ అటెండ్ కాలేకపోయారు.
Sharing the special moments from my engagement with you. Thank you #EatDrinkParty for the decor & #Antarika for beautifully capturing the day for us. pic.twitter.com/BaGOaLsdOj
— Allu Sirish (@AlluSirish) November 3, 2025
ప్రస్తుతం అల్లు శిరీష్ చేతిలో సినిమాలు లేవు. కొత్త కథలు వింటున్నాడు. గత ఏడాది రిలీజైన బడ్డీ మూవీతో చివరగా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. గౌరవం మూవీతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శిరీష్ కొత్త జంట, ఒక్క క్షణం, శ్రీరస్తు శుభమస్తుతో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు. ఇవేవీ అతడికి విజయాలను తెచ్చిపెట్టలేకపోయాయి.
Also Read – Prakash Raj: నేషనల్ అవార్డులపై ప్రకాష్ రాజ్ సంచలన కామెంట్స్


