Ramgopal Varma| ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద పోస్ట్ పెట్టారు. ‘పుష్ప2’ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. తాజాగా అల్లు అర్జున్(Allu Arjun) గురించి ఆర్జీవీ పెట్టిన పోస్ట్ తీవ్ర చర్చగా మారింది. ‘‘పుష్ప-2కి ఉన్న మెగా క్రేజ్ అల్లు కొత్త మెగా అని చెప్పడానికి స్పష్టమైన రుజువు ఇదే. అల్లు అర్జున్ బాహుబలి కాదు రియల్ మెగాబలి ఆఫ్ స్టార్స్’’ అని తెలిపారు. ఈ పోస్ట్ మెగా, అల్లు అభిమానుల మధ్య మరింత చిచ్చు రాజేశాలా ఉంది.
అయితే ఈ పోస్ట్‌కు తాను తీస్తున్న ‘శారీ’ సినిమా పోస్టర్ పెట్టడం గమనార్హం. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో ఆరాధ్య దేవి(Aaradhya Devi), సత్య యాదు జంటగా నటిస్తున్నారు. పలు నిజజీవిత సంఘటనల ఆధారంగా సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 30న తెలుగు, హిందీ, తమిళ, మలయాళంలో విడుదల కాబోతున్నట్లు ఈ పోస్టర్‌లో ఆర్జీవీ వెల్లడించారు.