Kubera Ott Release date: టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ కుబేర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. జూలై 18 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానున్నట్లు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. థియేటర్లలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ నెల రోజులు కాకముందే ఓటీటీలోకి రావడం ఆసక్తికరంగా మారింది.
నిర్మాతలకు షాక్…
కుబేర మూవీ రిలీజై ఇరవై రోజులు దాటినా డీసెంట్ కలెక్షన్స్‌ను రాబడుతోంది. పోటీగా పెద్ద సినిమాలు లేకపోవడం, హిట్టు టాక్ రావడంతో తెలుగులో ఇప్పటికీ చాలా థియేటర్లలో కుబేర ఆడుతోంది. థియేటర్లలో ఈ మూవీ ఉండగానే ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించి నిర్మాతలకు అమెజాన్ ప్రైమ్ పెద్ద షాకిచ్చింది. అయితే రిలీజ్‌కు ముందు ఓటీటీతో మేకర్స్ ఎలాంటి డీలింగ్స్ పెట్టుకున్నారనే దానిపై క్లారిటీ లేదు. మరి మేకర్స్ ఎలా స్పందిస్తారనే దానిపై వేచి చూడాలి.
Also Read – Ap Cm on population: జనాభా నియంత్రణ కాదు… నిర్వహణే అవసరం: సీఎం చంద్రబాబు
బైలింగ్వల్ మూవీ…
ధనుష్ హీరోగా నటించిన కుబేర మూవీలో నాగార్జున కీలక పాత్ర పోషించాడు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కించారు. జూన్ 20న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ వంద కోట్ల వసూళ్లను సాధించింది. టాలీవుడ్‌లో హిట్‌గా నిలిచి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టిన ఈ మూవీ కోలీవుడ్‌లో మాత్రం డిజాస్టర్‌గా మిగిలింది. నాలుగేళ్ల తర్వాత రొటీన్‌కు భిన్నంగా శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కించాడని సినిమాను చూసిన వారందరూ అప్రిషియేట్ చేశారు.
బ్రేక్ ఈవెన్ టార్గెట్…
నాగార్జున, ధనుష్‌లకు ఉన్న క్రేజ్ కారణంగా తెలుగు, తమిళ భాషల్లో కుబేర థియేట్రికల్ బిజినెస్ గట్టిగానే జరిగింది. దాదాపు 65 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజైంది. ఇరవై రోజుల్లో వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ 138 కోట్ల గ్రాస్, 69 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టింది. తెలుగు వెర్షన్‌కు 70 కోట్ల వరకు కలెక్షన్స్ రాగా… తమిళ వెర్షన్ మాత్రం 20 కోట్ల లోపే వసూళ్లను దక్కించుకున్నది.
Also Read – SC Gurukula Students: ఐఐటీ, నీట్‌లో సీటు వచ్చిన విద్యార్థులకు రూ.లక్ష సాయం
నేషనల్ అవార్డ్….
కుబేర మూవీలో బిచ్చగాడి పాత్రలో ధనుష్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ మూవీతో మరోసారి ధనుష్‌కు నేషనల్ అవార్డ్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ చెబుతున్నారు. కుబేరలో నెగెటివ్‌గా కనిపించే పాజిటివ్ క్యారెక్టర్‌లో నాగార్జున నటించాడు. ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించాడు.


