Agastya Nanda: అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అమితాబ్ మనవడు అగస్త్య నందా… బయోపిక్‌తో హీరోగా హిందీ చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తున్నాడు. ఇక్కీస్ పేరుతో వార్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోంది. నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అతి చిన్న వయసులోనే పరమవీర చక్ర అవార్డును అందుకున్న సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్పాల్ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది.
దేశభక్తి, వార్, ఎమోషన్స్ ప్రధానంగా ఇక్కీస్ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. అగస్త్య నందాకు పరమవీర చక్ర అవార్డు ప్రకటించే సీన్‌తోనే ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా మొదలైంది. మిమ్మల్ని గర్వపడేలా చేసే నాయకుడిగా ఉండటానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను. చిన్నప్పుడు అతడు సైన్యం గురించి చెప్పే కథలు వినేవాడు. మీ కథలు అతడికి స్ఫూర్తినిచ్చి ఉండవచ్చు అనే డైలాగ్స్ ట్రైలర్‌లో ఆసక్తిని పంచుతున్నాయి.
Also Read – Rashmika Mandanna: మోడ్రన్ డ్రెస్‌లో మెరిసిన రష్మిక.. రౌడీ హీరోయిన్ అందానికి నెటిజన్లు ఫిదా..!
నీ వయసెంత అని ఓ పాత్రధారి అడగ్గా… ఇరవై ఒకటి… మన యుద్ధానికి వెళుతున్నామా అని అగస్త్య నందా బదులివ్వడం ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచింది. 1971 ఇండియా పాకిస్థాన్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో ఇక్కీస్ మూవీని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్. అరుణ్ ఖేతర్పాల్ జీవితంలోకి రొమాంటిక్ ట్రాక్‌ను ట్రైలర్‌లో చూపించారు. ఇక్కీస్ మూవీలో బాలీవుడ్ వెటరన్ హీరో ధర్మేంద్రతో పాటు జైదీప్ అహ్లవత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అద్యాన్షీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇక్కీస్ కంటే ముందు ది ఆర్చిస్ వెబ్‌సిరీస్ చేశాడు అగస్త్య నందా. జోయా అక్తర్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ 2023లో రిలీజైంది. ఈ వెబ్ సిరీస్ ద్వారా అగస్త్య నందాతో పాటు సుహానా ఖాన్, ఖుషి కపూర్‌తో పాటు మరికొందరు వారసులు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక్కీస్ మూవీలో అక్షయ్ కుమార్ మేనల్లుడు సిమర్ భాటియా కూడా నటించబోతున్నాడు. ఇక్కీస్ మూవీ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీపై బాలీవుడ్‌లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.
Also Read – Bhoomi Shetty: అదరగొట్టిన ప్రశాంత్ వర్మ ‘మహాకాళి’ ఉగ్రరూపం!


