Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభAmitabh Bachchan : ఆ కంపెనీకి లీగల్ నోటీసులిచ్చిన అమితాబ్.. ఎందుకో తెలుసా??

Amitabh Bachchan : ఆ కంపెనీకి లీగల్ నోటీసులిచ్చిన అమితాబ్.. ఎందుకో తెలుసా??

- Advertisement -

Amitabh Bachchan : బాలీవుడ్ లో పాన్ మసాలా యాడ్స్ ఎంత ఫేమసో అందరికి తెలిసిందే. స్టార్ హీరోలు సైతం డబ్బులకోసం పాన్ మసాలా యాడ్స్ లో నటిస్తారు అక్కడ. గతంలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఓ పాన్ మసాలా కంపెనీకి చెందిన యాడ్ లో నటించారు. ఈ యాడ్ చూసిన తర్వాత దేశ వ్యాప్తంగా అమితాబ్ పై విమర్శలు వచ్చాయి. ఒక స్టార్ హీరో అయి ఉండి ఆరోగ్యానికి హాని చేసే ఇలాంటి వాటికోసం ప్రకటనలు చేస్తారా అని ట్రోల్ చేశారు.

అలాగే నేషనల్ యాంటీ టుబాకో ఆర్గనైజేషన్ కూడా అమితాబ్ కి.. మీ లాంటి స్టార్స్ ఇలాంటి ప్రకటనలు చేసి ప్రజలని తప్పుదోవ పట్టించకూడదు. ఈ యాడ్ ని రద్దు చేసుకోండి అని కోరారు. దీంతో అమితాబ్ తను చేసిన పాన్ మసాలా యాడ్ ని రద్దు చేసుకుంటున్నట్టు, మళ్ళీ ఇలాంటి ప్రకటనలు చేయను అని తెలిపి ఆ కంపెనీతో మాట్లాడి యాడ్ ని రద్దు చేసుకోవడమే కాక తీసుకున్న రెమ్యునరేషన్ కూడా తిరిగి ఇచ్చేశారు.

కానీ ఆ పాన్ మసాలా కంపెనీ మాత్రం ఇంకా కొన్ని చోట్ల అమితాబ్ నటించిన యాడ్ ని వాడుకుంటుంది. ఇది అమితాబ్ దృష్టికి రావడంతో ఆ కంపెనీకి లీగల్ నోటీసులు పంపించారు. తను నటించిన యాడ్ వాడకం ఆపకపోతే న్యాయపరంగా తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు అమితాబ్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad