ఈరోజు ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంటికి బారసాలకు వచ్చి అనామిక వంద కోట్ల అప్పు గురించి మొత్తం చెప్పేస్తుంది. ఇదిగో బ్యాంకు నోటీస్ అని సాక్ష్యాలు చూపిస్తుంది. ఇప్పుడు మీ మొహాలు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని మీరు మీరు కొట్టుకోండి అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆతర్వాత ధాన్యలక్ష్మి గొడవ మొదలుపెడుతుంది. ఏంటి ఇప్పటివరకూ ఆస్తి పంపకాలు చేయకపోయినా ఉమ్మడి ఆస్తి ఎక్కడికీ పోవు ఎప్పటికైనా ఇస్తారు అనుకున్నాను కానీ ఇప్పుడు అసలు ఆస్తులు లేకుండా చేసారు. అందుకేనా ఇంట్లో ఆక్షంలు మొదలుపెట్టారు అని ప్రశ్నిస్తుంది. అపర్ణ కుడా గట్టిగా అడిగినా సమాధానం చెప్పకపోయే సరికి కావ్య చెప్పబోతుంటే రాజ్ ఆపుతాడు.
ఇందులో కావ్య తప్పు లేదు తనని ఏమి అనద్దు, 100 కోట్లు అప్పు చేయడం నిజమే మేమిద్దరం కష్టపడి రూ.25 కోట్లు అప్పు తీర్చేశాము ఇంకో 75 కోట్లు కుడా కష్టపడి అప్పు తీర్చేస్తాము అప్పుడు మీ అందరికీ సమాధానం చెప్తాను అని రాజ్ చెప్పి అక్కడినుంచి కావ్యని తీసుకుని వెళ్లిపోతాడు. అప్పుడు రుద్రాణి సుభాష్, ఇందిరాదేవి, అపర్ణకి ఈ విషయం తెలియకుండానే జరుగుతుందా నాటకాలు ఆడుతున్నారు అని అంటుంది. వాళ్ల మాటలు వినలేక అక్కడి నుంచి ముగ్గురు వెళ్లిపోతారు.
లోపలికి వెళ్లి అపర్ణ, సుభాష్ దీని గురించి మాట్లాడుకుంటారు. ఏదో బలమైన కారణం ఉంది అందుకే వాళ్లు అలా మౌనంగా ఉన్నారు లేదంటే వాళ్లు డబ్బు మనుషులు కాదు అని అనుకుంటారు. ఇక రూమ్‌లో కావ్య, రాజ్ ఈ విషయం అనామికకు ఎలా తెలిసింది అని మాట్లాడుకుంటారు. రూ.100 కోట్ల విషయం బయటపడిపోయింది అని అనుకుంటే పర్లేదు తాతయ్య విషయం తెలియలేదు కదా మనం తాతయ్య పరువు తీసే పని చేయకూడదు అని రాజ్ అంటాడు. ఇప్పటికే ఆ రుద్రాణి ఇది ఎందుకు జరిగిందో తెలుసుకోవాలని ట్రై చేస్తుంది అంటే వాళ్ల వళ్ల కాదు నువ్వు చూస్తూ ఉండు అని రాజ్ అంటాడు.
అక్కడ అనామిక ఏమో చేసిన పనికి సంతోషపడుతుంది. దీనితో సరిపోదు రేపు బ్యాంకు వాళ్లు ఇంటికి వెళ్లి జప్తు చేస్తారు అప్పుడు ఇంకా హ్యాపీ అవుదాం అంటుంది. మరోవైపు కళ్యాణ్, ప్రకాషం జరిగిన విషయం కోసం ఆలోచిస్తుంటే ధాన్యలక్ష్మి వచ్చి ఇంకా రెచ్చగొడుతుంది. మేలుకొని ఇప్పటికైనా ఆస్తులు ఇమ్మని అడగమంటుంది. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.