Takshakudu: ఆనంద్ దేవరకొండ కొత్త మూవీ థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను సోమవారం అనౌన్స్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు తక్షకుడు అనే టైటిల్‌ను కన్ఫామ్ చేశారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. వినోద్ అనంతోజు దర్శకత్వం వహిస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్…
తక్షకుడు మూవీ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సోమవారం రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో గన్ పట్టుకొని ఇంటెన్స్ లుక్‌లో ఆనంద్ దేవరకొండ కనిపిస్తున్నారు. గన్‌పై మంటల్లో కాలిపోతున్న కొన్ని గుడిసెలు కనిపిస్తున్నాయి. వేటగాడి చరిత్రలో జింకపిల్లలే నేరస్థులు అంటూ పోస్టర్‌పై ఉన్న క్యాప్షన్ ఆసక్తిని పంచుతోంది. అత్యాశ, ప్రతీకారం అనే అంశాలతో ముడిపడి ఈ సినిమా సాగనున్నట్లు తెలుస్తోంది.
Also Read- Viral: నీ రీల్స్ పిచ్చి తగలేయ్యా..శవం కాలుతుంటే యువతి రీల్స్..మండిపడుతున్న నెటిజన్లు!
రెండో సినిమా…
ఆనంద్ దేవరకొండ, డైరెక్టర్ వినోద్ అనంతోజు కాంబినేషన్‌లో ఇది సెకండ్ మూవీ. గతంలో వీరిద్దరి కలయికలో మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీ రూపొందింది. ఈ సినిమా కూడా ఓటీటీలోనే రిలీజైంది. మిడిల్ క్లాస్ మెలోడీస్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కగా.. తక్షకుడు మాత్రం యాక్షన్ కథాంశంతో రూపొందుతోంది.
తక్షకుడు మూవీలో నితాశీ గోయల్ హీరోయిన్‌గా నటిస్తోంది.
It started with atyasa, and prateekaram will follow. 🔥
Watch #Takshakudu, coming soon, only on Netflix.#TakshakuduOnNetflix #AnandDeverakonda @nitanshi_goel @vinodanantoju @vamsi84 #SaiSoujanya #MidhunMukundan @NavinNooli #MokshadhaBhupatiraju #UditKhurana @balaji_dop137… pic.twitter.com/LpifH7wSmT
— Sithara Entertainments (@SitharaEnts) October 13, 2025
ఏడాది గ్యాప్…
బేబీ మూవీతో కెరీర్‌లో పెద్ద హిట్టు అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ. యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ వంద కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకున్నది. బేబీ సక్సెస్‌తో కథల ఎంపిక ఆచితూచి ఆడుగులు వేస్తున్నాడు ఆనంద్ దేవరకొండ. తక్షకుడుతో ఏడాది గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
సీక్వెల్…
తక్షకుడుతో పాటు ప్రస్తుతం ఆదిత్య హసన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ఆనంద్ దేవరకొండ. నైంటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీని కూడా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది.
Also Read- Kantara Chapter 1: బాక్సాఫీస్: సెకండ్ వీకెండ్ సైతం ‘కాంతార: చాప్టర్ 1’దే!


