Vaishnavi Chaitanya: బేబీ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది వైష్ణవి చైతన్య. తొలి సినిమాలోనే నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో అద్భుతమైన యాక్టింగ్‌తో అదరగొట్టింది. పది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన బేబీ వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. బేబీ సక్సెస్‌తో వైష్ణవి చైతన్యకు తెలుగులో ఆఫర్లు బాగానే వచ్చాయి. కానీ సక్సెస్‌లు మాత్రం దక్కలేదు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్…
బేబీ బ్లాక్‌బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలయికలో మరో మూవీ రాబోతుంది. ఈ సినిమాకు నైంటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్‌సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హసన్ దర్శకత్వం వహించబోతున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నైంటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్‌సిరీస్‌కు సీక్వెల్‌గా ఆదిత్య హసన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి ఎపిక్ అనే టైటిల్‌ను కన్ఫామ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బేబీ తరహాలోనే సింపుల్‌గా ఆడియెన్స్‌కు రీచ్ అయ్యే టైటిల్ కోసం అన్వేషించిన మేకర్స్ ఎపిక్ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు.
బేబీ తర్వాత…
బేబీ తర్వాత తెలుగులో లవ్ మీ, జాక్ సినిమాలు చేసింది వైష్ణవి చైతన్య. ఈ రెండు సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. దాంతో ‘ఎపిక్’ మూవీ సక్సెస్ వైష్ణవి చైతన్య కెరీర్‌కు కీలకంగా మారింది. ఈ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నది వైష్ణవి చైతన్య. వన్ ఫిల్మ్ వండర్ అంటూ తనపై వస్తోన్న విమర్శలకు బదులివ్వాలని ఎదురుచూస్తోంది. మరోవైపు బేబీ తర్వాత మరో కమర్షియల్ హిట్టు కోసం ఆనంద్ దేవరకొండ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎపిక్ ఈ ఇద్దరికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఎపిక్ మూవీని తొలుత హీరో నితిన్‌తో చేయాలని అనుకున్నాడు డైరెక్టర్ ఆదిత్య హసన్. నితిన్‌కు కథ కూడా వినిపించాడు. నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ పతాకంపై ఈ సినిమా రూపొందాల్సింది. కానీ చివరి నిమిషంలో నితిన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. దాంతో నితిన్ ప్లేస్‌లో ఆనంద్ దేవరకొండతో ఎపిక్ మూవీని పట్టాలెక్కించాడు ఆదిత్య హసన్. ఇటీవలే లిటిల్ హార్ట్స్ మూవీతో ప్రొడ్యూసర్‌గా మారాడు ఆదిత్య హసన్. తొలి సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. రెండున్నర కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ నలభై కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకున్నది.
Also Read- Bigg Boss Nominations: కెప్టెన్ కి స్పెషల్ పవర్.. రాత్రిపూట రాజు, రాజా గుసగుసలు


