Napoleon Returns: వైవిధ్యమైన దర్శకుడిగా,రైటర్‌గా పేరున్న ఆనంద్ రవి హీరోగాను మారి సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. కొరమీను సినిమా తర్వాత నెక్ట్స్ సినిమా చేయటానికి కాస్త సమయం తీసుకున్నాడు. ఈసారి తనకు డైరెక్టర్‌గా మంచి పేరు తీసుకొచ్చిన సినిమా సీక్వెల్‌తోనే తను మన ముందుకు రాబోతున్నాడు. ఇంతకీ ఆనంద్ రవి నెక్ట్స్ మూవీ ఏంటి? టైటిల్ గ్లింప్స్ ఎలా ఉంది? అనే వివరాలను ఓ సారి చూసేద్దాం..
ఆనంద్ రవి, దివి ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీకి ‘నెపోలియన్ రిటర్న్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఆనంద్ రవి రూపొందించిన నెపోలియన్, ప్రతినిధి, విరాట పర్వం చిత్రాలు ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ యాక్టర్- డైరెక్టర్ ఆనంద్ రవి మరోసారి యూనిక్, ఫ్రెష్ కాన్సెప్ట్‌తో నెపోలియన్ రిటర్న్స్‌గా మన ముందుకు రాబోతున్నారు. ‘నెపోలియన్’ రిటర్న్స్’ విషయానికి వస్తే ఆనంద్ రవి తనదైన స్టైల్లో డిఫరెంట్ ప్రమోషనల్ వీడియోను విడుదల చేశారు. దీంతో సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. ఈ మూవీ ఎంటైర్ టీమ్ టైటిల్ గ్లింప్స్‌ను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు.
Also Read – IND-W vs BAN-W: టాస్ గెలిచిన భారత్.. మూడు మార్పులతో బరిలోకి.. బ్యాటింగ్ ఎవరిదంటే?
‘నెపోలియన్’ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ విషయానికి వస్తే.. ఆనంద్ రవి ఇద్దరితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వటానికి వెళతాడు. ఓ దున్నపోతు ఆత్మ సమస్యగా మారిందని పోలీసుతో చెబుతాడు. మరో వైపు ఆనంద్ రవి విజువల్స్‌తో పాటు తను ఏం కంప్లైంట్ చేయాలనుకుంటున్నాడో దానికి సంబంధించిన విజువల్స్‌ను చాలా వేగంగా చూపించారు. పోలీస్ రఘుబాబు సహా అందరూ ఆ దున్నపోతు ఆత్మ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటారు. ఇంట్లో కనిపించే పుర్రె ఓ చిన్నారిదని చెప్పటంతో ఇదే సరికొత్త హారర్ సస్పెసన్స్ మూవీ అనే ఫీల్ వస్తుంది మనకు. గ్లింప్స్ చివరలో ఓ పోలీస్ ఆఫీసర్ ఆనంద్ రవితో ఇంతకు ముందే నువ్వే కదా నీడ పోయిందని కంప్లైంట్ ఇచ్చావ్ అని అడగటంతో నెపోలియన్ సినిమా రెఫరెన్స్‌ను అక్కడ చూపించటంతో ఇది సీక్వెల్ అనే విషయం మరింత క్లారిటీ వచ్చింది.
గ్లింప్స్‌లో విజువల్స్ చాలా రిచ్‌గా కనిపిస్తున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఆనంద్ రవి, దవి, ఆటో రామ్ ప్రసాద్, రఘుబాబు, సూర్య పింగ్ పాంగ్, శ్రవణ్ రాఘవేంద్ర, యాంకర్ రవి, రవి వర్మ, మీసాల లక్ష్మణ్ తదితరులు ఇందులో నటించారు. భోగేంద్ర గుప్తా నిర్మిస్తోన్న ఈ సినిమాకు కార్తీక్ కొప్పెర సినిమాటోగ్రఫీ, సిద్ధార్థ్ సదాశివుని సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాకు రచన-దర్శకత్వం ఆనంద్ రవి. మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు.
Also Read – Pa Ranjith: ట్రోలింగ్స్‌పై డైరెక్టర్ పా రంజిత్ స్ట్రాంగ్ కౌంటర్.. వీడియో వైరల్


