Sandeep Reddy Vanga: ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. యానిమల్ బ్లాక్‌బస్టర్ తర్వాత సందీప్ వంగా చేస్తోన్న ఈ సినిమాపై పాన్ ఇండియన్ లెవెల్‌లో ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ప్రస్తుతం స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనులతో సందీప్ వంగా బిజీగా ఉన్నాడు. సెప్టెంబర్ నుంచే ఈ సినిమా సెట్స్‌పైకి రానున్నట్లు ప్రచారం జరిగింది. కానీ రాజా సాబ్ షూటింగ్ డిలే ఎఫెక్ట్ స్పిరిట్‌పై పడింది. నవంబర్ లేదా డిసెంబర్ నుంచి స్పిరిట్ షూటింగ్‌ను సందీప్ వంగా మొదలుపెట్టబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
చిన్న సినిమా…
ఈ గ్యాప్‌లో సందీప్ రెడ్డి వంగా ఓ చిన్న సినిమా చేయబోతున్నట్లు టాక్. అయితే లో బడ్జెట్ మూవీకి సందీప్ వంగా కేవలం నిర్మాతగానే వ్యవహరించనున్నాడట. నయా టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ స్వీయ నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ పతాకంపై సందీప్ వంగా ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు సమాచారం.
Also Read- NBK 111: బాలయ్య ఫేవరేట్ జానర్‌లో ఎన్‌బీకే 111 – రూటు మార్చిన గోపీచంద్ మలినేని
8 వసంతాలు హీరోయిన్…
ఈ మూవీలో ‘మేము ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా నటించబోతుండగా.. ‘8 వసంతాలు’ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ హీరోయిన్‌గా నటించబోతున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో విలేజ్ లవ్‌స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాకు రామ్‌గోపాల్ వర్మ శిష్యుడు వేణు దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. రా అండ్ రస్టిక్ కాన్సెప్ట్‌తో హై ఎమోషనల్ లవ్ డ్రామాగా ఉంటుందని చెబుతోన్నారు. త్వరలోనే ఈ సినిమా అఫీషియల్‌గా లాంఛ్ కానున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ చేయబోతున్నారట. స్టోరీ, స్క్రీన్‌ప్లే వంటి విషయాలకు సంబంధించి డైరెక్టర్‌కు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తూ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా చేస్తున్నాడట.
మ్యాడ్‌తో ఎంట్రీ…
మ్యాడ్ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అనంతిక సనీల్ కుమార్. తొలి అడుగులోనే హిట్టు అందుకుంది. ఇటీవల రిలీజైన 8 వసంతాలులో కథానాయికగా కనిపించింది. ఈ మూవీలో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిన్న సినిమా కమర్షియల్‌గా మాత్రం విజయాన్ని దక్కించుకోలేకపోయింది. సందీప్ రెడ్డి వంగా సినిమాలనూ అనంతిక పాత్రకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుందని అంటున్నారు. మరోవైపు ‘మేము ఫేమస్’ తర్వాత సుమంత్ ప్రభాస్ కూడా గోదారి గట్టుపైన అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది.
Also Read- Junior OTT: ఓటీటీలో శ్రీలీల మూవీకి షాక్ – జూనియర్ పోస్ట్‌పోన్ – కారణమిదేనా?


