Ananya Panday: గ్లామర్ బ్యూటీ అనన్య పాండే ‘టు మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ అనే షోలో ఫరా ఖాన్‌తో కలిసి పాల్గొంది. ఈ షోలో కాజోల్, ట్వింకిల్ ఖన్నా కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ సందర్బంగా జెన్ జీ ఆలోచనలు, మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించడంతో పాటు, రెండు తరాల మధ్య అభిప్రాయ బేధాలకు చర్చ జరిగింది. ఈ చర్చ ప్రధానంగా జెన్ జీ భావోద్వేగ అవగాహన, సాంకేతికతపై వారి ఆధారపడటం, వారు వ్యక్తం చేసే భావాల చుట్టూ తిరిగింది. ఈ సందర్బంగా అనన్య పాండే జెన్ జీ వైఖరిని గట్టిగా సమర్థించారు. ప్రజలు అనుకునే దాని కంటే జెన్ జీ వారికి చాలా ఎక్కువ తెలుసు అని అనన్య అన్నారు.
అయితే అనన్య పాండే మాట్లాడుతూ… జెన్ జీ తమ భావోద్వేగాలను బాగా అర్థం చేసుకుంటుందని వివరించారు. భావాల గురించి బహిరంగంగా మాట్లాడిన మొదటి తరం వారే అని, మానసిక ఆరోగ్యం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛను స్వీకరించిన మొదటి తరం కూడా వారే అని అనన్య పాండే చెప్పుకొచ్చింది.
Also Read – SSMB 29: రాజమౌళి ప్రతీ సినిమాకి కాపీ కొట్టడమే..
అనన్య వాదనను సీనియర్ నటీమణులు కొంచెం వ్యంగ్యంగా, ప్రశ్నించే ధోరణిలో తీసుకున్నారు. ఒక సరదా గేమ్‌లో, ‘జెన్ జీ వారి వీధిలో నడవడానికి కూడా గూగుల్ మ్యాప్స్ అవసరం’ అనే ట్వింకిల్ యొక్క చమత్కారమైన ప్రశ్నకు, అనన్య వెంటనే విభేదించగా ముగ్గురు సీనియర్ అతిథులు విచ్చేసిన ఫరా, కాజోల్, ట్వింకిల్ దీనికి సమర్ధన తెలియజేశారు. దీనికి కొనసాగింపుగా ఫరాఖాన్ మాట్లాడుతూ… ‘జెనీ జీ వారికి ఏమీ తెలుసు.. జెన్ జీ వారికి పులిసిన రొట్టెల గురించే తెలుసు’ అన్నారు. ట్వింకిల్ ఖన్నా తనదైన శైలిలో స్పందిస్తూ ‘జెన్ జీ దేనికీ భయపడరు, ప్రతిదానికీ ఆందోళన చెందుతారు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఫరా ఖాన్ మాట్లాడుతూ ‘జెన్ జీతమ భావాలను చాలా ఎక్కువగా వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల చిన్న విషయం నుండి బయటపడటం కూడా వారికి మానసిక ఆరోగ్య సమస్యగా మారుతోంది’ అని అన్నారు.ఈ విధంగా షో నటీమణుల సంభాషణ సరదాగా సాగింది.
Also Read – Rukmini Vasanth: రుక్మిణి వసంత్ పేరుతో మోసాలు – క్లారిటీ ఇచ్చిన కాంతార చాప్టర్ వన్ హీరోయిన్


