Jabardasth Comedy Show: జబర్దస్త్… తెలుగు టీవీ షోలలో ఓ ట్రెండ్‌సెట్టర్. ఈ కామెడీ షో ద్వారానే ఎంతో మంది హాస్యనటులు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. కొందరు డైరెక్టర్లు అయ్యారు. ఈ కామెడీ షోకు ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. టాప్ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా ఈ షోను వీడటం, కామెడీ తగ్గి డబుల్ మీనింగ్ డైలాగ్స్, బూతులు పెరిగిపోతుండటంతో జబర్దస్త్ క్రేజ్ క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. జబర్దస్త్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు మేకర్స్ కిందా మీదా పడుతున్నారు.
700 ఎపిసోడ్స్…
ఇటీవలే ఈ షోలోకి కొత్త హోస్ట్‌గా సీరియల్ హీరో మానస్ నాగుల పల్లి (Manas) ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా బుల్లితెర అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నది జబర్దస్త్ టీమ్. జబర్దస్త్ షో ప్రస్తుతం 699 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఆగస్ట్ 1 నాడు 700వ ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతుంది. ఈ షోకు సంబంధించిన ప్రోమోను ఇటీవల మేకర్స్ రిలీజ్ చేశారు.
Also Read – Human Interest: ఇంట్లో ఈ మెుక్క ఉంటే.. పాములు మీ దరిదాపులకు రమ్మన్నా రావు!
నాగబాబు, అనసూయ రీఎంట్రీ…
ఈ ప్రోమోలో నాగబాబుతో (Nagababu) పాటు అనసూయ (Anasuya Bharadwaj) కనిపించి అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. జబర్దస్త్ షోకి చాలా కాలం పాటు యాంకర్‌గా కొనసాగింది అనసూయ. ఒక రకంగా అనసూయకు స్టార్‌డమ్ వచ్చింది ఈ షో వల్లే. సినిమాల్లో అవకాశాలు పెరగడంతో గత ఏడాది జబర్దస్త్ కు గుడ్‌బై చెప్పింది. జబర్దస్త్ కు దాదాపు ఎడేనిమిది ఏళ్ల పాటు జడ్జ్‌గా వ్యవహరించిన నాగబాబు కూడా పాలిటిక్స్ కారణంగా ఈ కామెడీ షోకు దూరమయ్యాడు.
చిరంజీవి హిట్ సాంగ్‌కు…
700వ ఎపిసోడ్‌కు నాగబాబు, అనసూయ గెస్ట్‌లుగా వచ్చారు. ఈ ప్రోమోలో చిరంజీవి హిట్ సాంగ్‌కు స్టెప్పులు వేస్తూ అభిమానులను ఆకట్టుకున్నది అనసూయ. ఆ తర్వాత హైపర్ ఆదిపై విరుచుకుపడింది. ఆది వల్లే తాను జబర్దస్త్ ను వీడాల్సివచ్చిందని కామెంట్స్ చేసింది. నీతో పాటు స్కిట్స్ చేసి ఎంతో ఎంకరేజ్ చేశాను. కానీ ఎక్కడ నా ఎక్స్‌క్లూజివిటీ లేదు. అది నా ఏడుపు అంటూ హైపర్ ఆదిపై ఫైర్ అయ్యింది అనసూయ. “నువ్వు అమెరికా వెళ్లినా కూడా నీకు లింకులు పంపించా. అదిరా మన లింకు” అంటూ అనసూయను కూల్ చేయబోయాడు హైపర్ ఆది. అతడి జోకులకు నవ్వకపోగా మరింత సీరియస్ అయ్యింది అనసూయ. “ఇదిగోండి ఇలాంటివి మాట్లాడుతున్నందుకే నేను వెళ్లిపోయింది” అంటూ జడ్జ్‌లకు కంప్లైంట్ ఇచ్చింది. ప్రోమోలో చూస్తుంటే అనసూయ, ఆది మధ్య పెద్ద డిస్కషన్ జరిగినట్లు కనిపిస్తోంది. ఈ ప్రోమోలో చమ్మక్ చంద్ర, ధనరాజ్‌తో పాటు పలువురు మాజీ కంటెస్టెంట్స్ కూడా ఈ ప్రోమోలో కనిపించారు.
Also Read – Kingdom advance bookings: అమెరికాలో కింగ్‌డమ్ హవా.. అడ్వాన్స్ బుకింగ్స్‌తో రౌడీ ర్యాంపేజ్!


