Anasuya: యాంకర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అనసూయ. ఇప్పుడు సినిమాల కోసం తనకు పేరుతో పాటు గుర్తింపును తెచ్చిపెట్టిన బుల్లితెరకు దూరమైంది. జబర్ధస్థ్‌కు రెండేళ్ల క్రితం గుడ్‌బై చెప్పిన అనసూయ అడపాదడపా టీవీ షోస్‌లో మెరుస్తోంది. టీవీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన వారు చాలా తక్కువ మందే ఉన్నారు. అనసూయ మాత్రం ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసింది. స్టార్ హీరోల సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటోంది. ఇటీవల రిలీజైన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లులో స్పెషల్ సాంగ్‌లో తళుక్కున మెరిసింది. అల్లు అర్జున్ పుష్ప 2లో దాక్షాయణిగా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో తన నటనతో ఆకట్టుకుంది.
ఐదారు సినిమాలు…
ప్రస్తుతం తెలుగులో అనసూయ చేతిలో ఐదారు సినిమాలు ఉన్నాయట. తమిళంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెప్పింది. ఇటీవలో ఓ షాపింగ్‌మాల్ ఓపెనింగ్‌లో పాల్గొన్న అనసూయ తాను చేయబోతున్న సినిమాల వివరాలను రివీల్ చేసింది. ప్రస్తుతం ఓ మూడు సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నట్లు వెల్లడించింది.
తల్వార్‌లో…
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న తల్వార్‌లో ఓ బ్యూటీఫుల్ క్యారెక్టర్ చేస్తున్నా. అలాగే ఓ ఫ్యామిలీ అంతా కలిసి చూసే మరో ఇంట్రెస్టింగ్ మూవీలో నటిస్తున్నా. ఈ సినిమా టైటిల్‌ను త్వరలోనే వెల్లడిస్తా. రెండు సినిమాలతో పాటు మరో తెలుగు మూవీ కథ విన్నాను. సినిమాలో నా క్యారెక్టర్‌కు సంబంధించి కొన్ని ఛేంజెస్ చెబితే… దర్శకుడు అంగీకరించాడు అని అనసూయ చెప్పింది. మైథలాజికల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న నాగబంధం మూవీలో కూడా ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నట్లు తెలిపింది.
కోలీవుడ్‌లోకి ఎంట్రీ…
తాను నటించిన ఆరితో పాటు మరికొన్ని తెలుగు సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయని అనసూయ చెప్పింది. ఈ ఏడాది కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు పేర్కొన్నది. కుటుంబానికి టైమ్ కేటాయించాలనే బుల్లితెరకు కొంచెం గ్యాప్ ఇచ్చినట్లు అనసూయ తెలిపింది. అలాగని పూర్తిగా దూరం కానని, అప్పుడప్పుడు టీవీ షోస్‌లో కనిపిస్తానని అన్నది. బిగ్‌బాస్ తర్వాత కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 3 మొదలవుతుందని అనసూయ చెప్పింది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోకకు అనసూయ జడ్జ్‌గా వ్యవహరిస్తుంది.
Also Read – Vastu: పగిలిన అద్దం, గిన్నెలు ఇంట్లో పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసా!


