Anasuya:గత కొన్నాళ్లుగా సినిమాల జోరును తగ్గించింది అనసూయ. ఆఫర్లు చాలానే వస్తోన్న వాటిని రిజెక్ట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లులో స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. ఆరి మూవీలో డిఫరెంట్ రోల్ చేసింది. ఈ రెండు మినహా అనసూయ నుంచి 2025లో మరే సినిమా రాలేదు. మరోవైపు కొత్త సినిమాలపై సంతకం కూడా చేయకపోవడం ఆసక్తికరంగా మారింది. సడెన్‌గా ఓ కోలీవుడ్ మూవీలో కనిపించి అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది అనసూయ. ప్రభుదేవా హీరోగా ఊల్ఫ్ పేరుతో తమిళంలో హారర్ ఫాంటసీ మూవీ తెరకెక్కుతోంది. రెండు, మూడేళ్ల క్రితమే ఈ సినిమా మొదలైంది. కానీ ఆర్థిక సమస్యల వల్ల రిలీజ్ డిలే అవుతూ వచ్చింది.
అన్ని అడ్డంకులను దాటుకొని ఊల్ఫ్ మూవీ రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రమోషన్స్‌ను మేకర్స్ మొదలుపెట్టారు. గురువారం ఊల్ఫ్ మూవీ నుంచి సాసా అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటలో ప్రభుదేవాతో పాటు అనసూయ, లక్ష్మిరాయ్, అంజు కురియన్ కనిపించారు. రొమాంటిక్‌గా ఈ సాంగ్ సాగింది. మిగిలిన ఇద్దరు హీరోయిన్లతో పోలిస్తే ప్రభుదేవా, అనసూయ కెమిస్ట్రీ పాటలో ఎక్కువగా హైలైట్ అవుతోంది. ఈ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. అనసూయను ఇలాంటి రొమాంటిక్ సాంగ్‌లో చూడటం సర్‌ప్రైజింగ్‌గా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read – Deepthi Sunaina: క్యూట్ లుక్స్ తో కవ్విస్తున్న దీప్తి సునైనా
కాగా ఊల్ఫ్ మూవీతోనే అనసూయ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇందులో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా అనసూయ కనిపించబోతున్నట్లు సమాచారం. ఊల్ఫ్ మూవీలో అనసూయ రోల్ నెగెటివ్ షేడ్స్‌తో సాగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె పాత్రలో గ్లామర్, యాక్టింగ్… రెండు ఎలిమెంట్స్ ఉంటాయట.
ఊల్ఫ్ మూవీని తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. గురువారం కేవలం తమిళ సాంగ్‌ను మాత్రమే రిలీజ్ చేశారు. ఊల్ఫ్ మూవీతో కోలీవుడ్‌లో పాగా వేయాలనే అనసూయ కోరిక నెరవేరుతుందో లేదా అన్నది త్వరలో తేలనుంది. ఊల్ఫ్ మూవీకి విను వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఊల్ఫ్ కంటే ముందు తమిళంలో ఫ్లాష్‌బ్యాక్ పేరుతో మరో సినిమా చేసింది అనసూయ. అందులో కూడా ప్రభుదేవానే హీరో. కానీ ఈ మూవీ కూడా రిలీజ్ కాకుండా ఆగిపోవడం గమనార్హం. సినిమాలు మాత్రమే కాకుండా టీవీ షోస్ కూడా తగ్గించింది అనసూయ. మూడేళ్ల క్రితమే జబర్ధస్థ్‌కు గుడ్‌బై చెప్పింది. అడపా దడపా కొన్ని టీవీ షోస్‌లో జడ్జ్‌గా తళుక్కున మెరుస్తోంది.
Also Read – Chinmayi Sripada: చిన్మయిపై అసభ్యకర కామెంట్స్ – సీపీ సజ్జనార్‌కు కంప్లైంట్ ఇచ్చిన సింగర్


