Actress Anasuya Warning: యాంకర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి యాక్టర్‌గా సక్సెస్ అయిన వాళ్లు టాలీవుడ్‌లో చాలా తక్కువ మందే ఉన్నారు. వారిలో అనసూయ ఒకరు. బుల్లితెర పాపులర్ కామెడీ షో జబర్ధస్థ్‌తో తెలుగులో ఫేమస్ అయ్యింది. ఈ టీవీ షోకు హోస్ట్‌గా దాదాపు పదేళ్ల పాటు కొనసాగింది అనసూయ. జబర్ధస్థ్‌లో కంటెస్టెంట్స్‌పై తనదైన శైలిలో పంచ్‌లు వేస్తూ అలరించింది. గ్లామర్ విషయంలో తగ్గేదేలే అంటూ మెరిపించింది.
నెగెటివ్ షేడ్స్ క్యారెక్టర్…
జబర్ధస్థ్ ద్వారా వచ్చిన పాపులారిటీతో సినిమాల్లో అవకాశాలు అందుకున్నది అనసూయ. నెగెటివ్ షేడ్స్‌తో పాటు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపించింది. కొన్నింటిలో లీడ్ రోల్స్ చేసింది. క్షణం, రంగస్థలం సినిమాలు అనసూయ కెరీర్‌ను మలుపుతిప్పాయి. పుష్పతో పాటు పుష్ప 2లో దాక్షాయణిగా విలన్ పాత్రలో అదగొట్టింది. ఇటీవల రిలీజైన పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమాలో స్పెషల్ సాంగ్‌లో తళుక్కున మెరిసింది.
Also Read – Shocking: ఏడాది పిల్లోడు.. ఏకంగా నాగు పామునే కొరికి చంపాడు..
పెద్దిలో అనసూయ…
సినిమాల్లో బిజీ కావడంతో రెండేళ్ల క్రితం జబర్ధస్థ్‌కు గుడ్‌బై చెప్పింది అనసూయ. యాక్టింగ్‌పైనే ఫుల్‌గా ఫోకస్ పెడుతోంది. రామ్‌చరణ్ పెద్దిలో అనసూయ నటించబోతున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రంగస్థలం తరహాలోనే ఓ పవర్‌ఫుల్ రోల్‌లో ఆమె కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లపై అనసూయ క్లారిటీ ఇచ్చింది. పెద్ది సినిమాలో తాను నటించడం లేదని రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. పెద్ది సినిమాలో అవకాశం ఇవ్వనందుకు డైరెక్టర్ బుచ్చిబాబుపై ఇప్పటికీ తనకు కోపంగానే ఉందని అనసూయ చెప్పింది.
వార్నింగ్ ఇచ్చా…
బుచ్చిబాబు రాసే కథల్లో ఇంపార్టెంట్ ఫీమేల్ క్యారెక్టర్స్ దాదాపు హీరోయిన్లే కనిపిస్తారు. పెద్ది కథ అలానే ఉండబోతుంది. నెక్స్ట్ చేసే సినిమాలో నా కోసం ఓ స్ట్రాంగ్ ఫీమెల్ క్యారెక్టర్ రాయకపోతే మీతో కటీఫ్ అని ఇటీవలే పెద్ది సినిమా సెట్స్‌కు వెళ్లినప్పుడు బుచ్చిబాబును బెదిరించాను అని అనసూయ తెలిపింది. పెద్ది సినిమా చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని, దర్శకుడిగా బుచ్చిబాబు కెరీర్ గ్రాఫ్ విషయంలో తాను చాలా హ్యాపీగా ఉన్నానని అనసూయ అన్నది. పెద్ది మూవీపై అనసూయ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
ప్రోమో రిలీజ్…
జబర్ధస్థ్ మొదలై 12 ఏళ్లు అవుతోన్న సందర్భంగా ఆగస్ట్ 1న మేకర్స్ స్పెషల్ ఎపిసోడ్ టెలికాస్ట్ చేయబోతున్నారు. ఈ ఎపిసోడ్‌కు అనసూయ గెస్ట్‌గా రాబోతుంది. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇటీవల రిలీజైంది.
Also Read – Oppo Reno 14FS 5G: త్వరలో మార్కెట్లోకి ఒప్పో రెనో 14FS 5G.. ధర, లాంచ్ డేట్, ఫీచర్లు లీక్..


