Jabardasth: అనసూయ, రష్మి… ఈ ఇద్దరూ జబర్ధస్త్ ద్వారానే యాంకర్లుగా ఫేమస్ అయ్యారు. ఈ కామెడీ షోకు తమ గ్లామర్‌తో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. సినిమాల్లో బిజీగా మారడంతో అనసూయ జబర్ధస్థ్‌కు దూరమవ్వగా… రష్మీ మాత్రం ఇప్పటికీ యాంకర్‌గా కంటిన్యూ అవుతోంది. లాంగ్ గ్యాప్ తర్వాత అనసూయ, రష్మి మరోసారి కలిసి జబర్ధస్థ్ షోలో సందడి చేశారు.
12 ఇయర్స్ మెగా సెలబ్రేషన్స్…
జబర్ధస్త్ షో మొదలై 12 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా 12 ఇయర్స్ మెగా సెలబ్రేషన్స్ పేరుతో ఓ స్పెషల్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నది మల్లెమాల. ఈ స్పెషల్ ఈవెంట్‌కు నాగబాబు, అనసూయ, బలగం వేణు, చమ్మక్‌చంద్రతో పాటు పలువురు మాజీ కంటెస్టెంట్స్ హాజరయ్యారు. 12 ఇయర్స్ మెగా సెలబ్రేషన్స్ ఎపిసోడ్ తాలూకు ప్రోమోను ఈటీవీ రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో అనసూయతో పాటు రష్మి మధ్య గొడవలు బయటపడ్డాయి. ఇద్దరు యాంకర్లు ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకోవడం ఆసక్తిని పంచింది.
జబర్ధస్త్ అనసూయనే…
ఈ ప్రోమోలో.. ఇప్పటికీ నేను ఎక్కడికి వెళ్లినా, ఎంత కష్టపడి నటిగా నన్ను నేను నిరూపించుకోవాలని అనుకుంటున్నా… ఈ జన్మకు మాత్రం నేను జబర్ధస్త్ అనసూయనే అని అనసూయ అన్నది. అనసూయ, రష్మి మధ్య సాగిన సంభాషణ ఈ ప్రోమోకు హైలైట్‌గా నిలిచింది.
Also Read – Ghaati Trailer: సీతమ్మోరు లంకా దహనం చేస్తే.. అనుష్క మాస్ రోర్
రష్మి కన్నీళ్లు…
జీవితం బోలెడు అవకాశాలు ఇవ్వదు అంటారు కానీ నేనంటాను తప్పకుండా ఇస్తుంది అంటూ చెప్పిన అనసూయ… కొన్ని ప్యాచప్స్ చేయాల్సి ఉందంటూ స్టేజ్‌పైకి ఎంట్రీ ఇచ్చి రష్మిని హగ్ చేసుకుంది. అనసూయను చూడగానే రష్మి ఎమోషనల్ అయిపోయి కన్నీళ్లు పెట్టుకుంది. ఎవరికి తెలియనివి కొన్ని తెలిసిపోయేలా ఉన్నాయి మన ప్యాచ్ అప్ వల్ల అని అనసూయ అన్నది. ఓ వీళ్లిద్దరూ మాట్లాడుకోరా అంటూ అనసూయ సీక్రెట్ బయటపెట్టబోతుండగా రష్మి అడ్డుకుంది. అదే వాట్సప్‌లో గానీ ఫోన్ చేసి మాట్లాడుంటే అయిపోయేదిగా అని రష్మి బదులిచ్చింది. అలా అయితే చాలా ఈగోలు అడ్డొచ్చాయి. ఇలా అయితే అంటూ అనసూయ నవ్వింది.
రష్మి ఒంటరైంది…
సుధీర్, రష్మి ప్రేమాయణంపై ఈ ప్రోమోలో హైపర్ ఆది వేసిన పంచ్‌లు నవ్వించాయి. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా అని గతంలో సుధీర్, రష్మి మధ్య ఫేమస్ అయిన ఓ డైలాగ్ గుర్తుచేశాడు హైపర్ ఆది. చచ్చిపోవడం దేవుడెరుగు కనీసం వచ్చిపోవడం కూడా లేదు అంటూ సుధీర్‌పై పంచ్‌లు వేశాడు. రష్మి ఒంటరైంది. సుధీర్ మాత్రం ఆడపిల్లలతో పాడుకుంటున్నాడు, చిన్నపిల్లలతో ఆడుకుంటున్నాడు అంటూ ఆది చెప్పిన డైలాగ్స్ ప్రోమోలో నవ్వించాయి.
Also Read – Rakul Preet Singh : బులెట్ కాఫీతో డే స్టార్ట్ చేసి..దూసుకుపోవడమే..రకుల్ రహస్యం!


