Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభAndhra King Taluka: రిలీజ్ డేట్ వచ్చేసింది.

Andhra King Taluka: రిలీజ్ డేట్ వచ్చేసింది.

Andhra King Taluka: ఇప్పటికే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో లఘు చిత్రాలతో అనుభవం సంపాదించిన కొత్త దర్శకులు సినిమాలకి దర్శకుడిగా అవకాశం అందుకొని సక్సెస్ సాధించారు. అలాగే, షార్ట్ ఫిలింతో గుర్తింపు తెచ్చుకున్న హీరోలు, హీరోయిన్లు కూడా ఉన్నారు. అయితే, ఈ షార్ట్ ఫిలిమ్స్ ట్రెండ్ మొదలవకముందే షార్ట్ ఫిలిం చేశాడు హీరో రామ్ పోతినేని. తమిళంలో చేసిన ఆ సినిమా చూసే, దర్శకనిర్మాత వైవిఎస్ చౌదరి రామ్ ను హీరో ఎంచుకొని దేవదాస్ అనే సినిమా చేశాడు.

- Advertisement -

దేవదాస్ సినిమా ద్వారా ఇలియానా హీరోయిన్‌గా టాలివుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. మొదట్లో సాంగ్స్ ఎక్కువగా ఉన్నాయని, పెద్దగా కథ లేదని నెగిటివ్ గా మాట్లాడారు. కానీ, రెండవ వారానికే ఈ టాక్ మొత్తం పాజిటివ్ గా మారింది. సంక్రాంతి పండుగా సందర్భంగా వచ్చిన దేవదాస్ సినిమా అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్. రామ్ మొదటి సినిమాతోనే మంచి హిట్ పడింది. దీని తర్వాత రామ్ కు కూడా వరుస హీరో అవకాశాలు వచ్చాయి.

Also Read – Ram Charan: నా హీరో మీరే – తండ్రికి రామ్‌చ‌ర‌ణ్ ఎమోష‌న‌ల్ బ‌ర్త్‌డే విషెస్ – వీడియోతో స్వీట్ స‌ర్‌ప్రైజ్‌

ఆర్య తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన జగడం మూవీ భారీ హిట్ అనుకున్నారు. కారణం ఇద్దరికి మొదటి సినిమా సూపర్ సక్సెస్ అయింది కాబట్టు. కానీ, ఈ మూవీ ఫ్లాప్ గా నిలిచింది. ప్రస్తుతం రామ్ హీరోగా పి. మహేష్ బాబు దర్శకత్వంలో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాను చేస్తున్నాడు. ఇందులో రామ్ అభిమాని పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ నుంచి వచ్చిన అప్‌డేట్ తో భారీ అంచనాలు మొదలయ్యాయి.

ఇక ఈ సినిమాలో మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ.. రామ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ మధ్య ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి వచ్చిన పాటకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ షాకింగ్ విషయం విషయం ఏమిటంటే.. ఈ పాటను రాసింది రామ్ కావడం విశేషం. ఆ పాట విన్న ప్రతీ ఒక్కరు రామ్ లో ఇంత గొప్ప సాహిత్యకారుడు ఉన్నాడా.. అని షాకవుతున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ ఏడాది నవంబర్ 28న ఆంధ్ర కింగ్ తాలూకా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గతకొంతకాలంగా రామ్ కి సరైన సక్సెస్ లేదు. ఈ మూవీతోనైనా సక్సెస్ దక్కుతుందో లేదో చూడాలి.

Also Read – Anupama Parameswaran: ఒకే రోజు రిలీజైన‌ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ రెండు సినిమాలు – ఒక‌టి థియేట‌ర్‌లో – మ‌రోటి ఓటీటీలో

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad