Wednesday, April 2, 2025
Homeచిత్ర ప్రభAndrea Jeremiah : సహజీవనం చేసి తప్పు చేశా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Andrea Jeremiah : సహజీవనం చేసి తప్పు చేశా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

- Advertisement -

Andrea Jeremiah : కోలీవుడ్ భామ ఆండ్రియా జెర్మియా నటిగా, సింగర్ గా తమిళ్ తో పాటు తెలుగులో కూడా పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం తమిళ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ భామ. త్వరలో ఆండ్రియా నటించిన పిశాచి 2 రిలీజ్ అవ్వనుంది. సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేసే ఆండ్రియా సినిమాల్లో కూడా ఓల్డ్ సన్నివేశాలకి సై అంటుంది.

ఆండ్రియా 36 ఏళ్ళు వచ్చినా పెళ్లి మాట ఎత్తట్లేదు. తాజాగా తన పిశాచి 2 సినిమా ప్రమోషన్స్ లో తన పెళ్లి గురించి అడగగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఆండ్రియా పెళ్లి గురించి మాట్లాడుతూ.. ”గతంలో ఒకర్ని ప్రేమించి అతనితో కొన్నాళ్ళు సహజీవనం కూడా చేశాను. ఆ సమయంలో నేను శారీరికంగా, మానసికంగా చాలా బాధపడ్డాను. మళ్ళీ ప్రేమ, పెళ్లి జోలికి వెళ్లకూడదని అప్పుడే డిసైడ్ అయ్యాను. పెళ్లి తర్వాత చాలా మంది అమ్మాయిలు సంతోషంగా లేరు. పెళ్లి చేసుకోకుండా ఉన్నవాళ్లు చాలా మంది సంతోషంగా ఉన్నారు. నేను పెళ్లి చేసుకొని నా సంతోషాన్ని దూరం చేసుకోలేను. నాకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా లేదు” అని తెలిపింది. అయితే పెళ్లి చేసుకున్న అమ్మాయిలు సంతోషంగా లేరు అని ఆండ్రియా అన్న మాటలు వైరల్ గా మారాయి. మరి గతంలో ఎవరితో సహజీవనం చేసిందో అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News