Thursday, July 4, 2024
Homeచిత్ర ప్రభAnil Kapoor: మళ్లీ హాలీవుడ్ లో అనిల్ కపూర్

Anil Kapoor: మళ్లీ హాలీవుడ్ లో అనిల్ కపూర్

బాలీవుడ్ బిగ్ స్టార్ అనిల్ కపూర్ చేసిన సినిమాలు తక్కువైనా హిట్లు ఎక్కువ ఉన్న హీరోగా పేరగాంచారు. ఇప్పటికీ ఆయన సోలో, మల్టీ స్టారర్ మూవీస్ చేస్తూనే ఓటీటీలో చాలా ప్రయోగాలు చేస్తూ తన ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు. హాలీవుడ్ స్టార్స్ టామ్ క్రూజ్ తో సహా చాలామంది మంచి దోస్తీ ఉన్న నటుడైన అనిల్ కపూర్ మరోమారు హాలీవుడ్ లో యాక్ట్ చేస్తున్నారు.

- Advertisement -

జెరేమీ రెన్నర్ తో కలిసి అనిల్ కపూర్ నటించబోతున్నట్టు ఆయన స్వయంగా ట్వీట్ చేశారు. డిస్నీ ప్లస్ రియాల్టీలో ప్రసారం అయ్యే Rennervations అనే సిరీస్ లో వీళ్లద్దరూ కలిసి నటించనున్నారు. ద నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్ రిలీజ్ తో ప్రస్తుతం అనిల్ కపూర్ ఫుల్ జోష్ లో ఉండగా తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు ఈ సీనియర్ హీరో.

స్లమ్ డాగ్ మిలియనీర్, 24, మిషన్ ఇంపాజిబుల్ వంటి హాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో యాక్ట్ చేసిన అనిల్ రెనర్వేషన్స్ తో మరోమారు హాలీవుడ్ లో మెరవనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News