రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’(Spirit) సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో, టి-సిరీస్ ఫిలిమ్స్ నిర్మాణంలో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలవుతుందని, మెక్సికోలో ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశామని ఇప్పటికే దర్శకుడు ప్రకటించారు. ఇందులో ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇంతలోనే ఈ సినిమా నుంచి ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణే తప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మూవీ హీరోయిన్‌ని అధికారికంగా ప్రకటించారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ‘యానిమల్’ సినిమాలో త్రిప్తి దిమ్రి నటించింది. ఆమె నటన నచ్చిన సందీప్ ఇప్పుడు మెయిన్ హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. ఈమేరకు అధికారికంగా ఓ పోస్టర్ విడుదల చేసింది.



