Anirudh: విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ జూలై 31న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. విజయ్ దేవరకొండ కెరీర్‌కు ఈ మూవీ కీలకంగా మారింది. 2018లో రిలీజైన టాక్సీవాలా తర్వాత విజయ్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. భారీ అంచనాల నడుమ రిలీజైన లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు కూడా నిరాశనే మిగిల్చాయి. కింగ్డమ్ తనను గట్టెక్కిస్తుందని బోలెడు ఆశలు పెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ.
వంద కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్…
ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీకి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ కారణంగా కింగ్డమ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వంద కోట్ల వరకు జరిగింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే ఉన్నాయి.
కింగ్డమ్ చూశా…
కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కింగ్డమ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు అనిరుధ్. కింగ్డమ్ సినిమా చూశానని, అవుట్‌పుట్ చాలా బాగా వచ్చిందని చెప్పాడు. జెర్సీకి మించి కింగ్డమ్ పెద్ద విజయాన్ని సాధిస్తుందనే నమ్మకముందని అనిరుధ్ అన్నాడు.
మైల్ స్టోన్‌లా…
విజయ్ దేవరకొండతో పాటు డైరెక్టర్ గౌతమ్, ప్రొడ్యూసర్ నాగవంశీ కెరీర్‌లో కింగ్డమ్ ఓ మైల్‌స్టోన్‌లా నిలుస్తుంది. తెలుగు ప్రేక్షకుల కోసం చేసిన ఓ కొత్త ప్రయత్నమిది. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ అద్భుతంగా నటించారు అని అనిరుధ్ పేర్కొన్నాడు. కింగ్డమ్ సినిమాను ఉద్దేశించి అనిరుధ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి. అనిరుధ్ సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చాడంటే సినిమా హిట్టేనని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చెబుతోన్నారు.
హిందీలో సామ్రాజ్య…
స్పై యాక్షన్ అంశాలకు అన్నదమ్ముల అనుబంధం జోడించి కింగ్డమ్ మూవీని రూపొందించారు గౌతమ్ తిన్ననూరి. ఇటీవల రిలీజైన ఈ సినిమా ట్రైలర్ మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్నది. పాన్ ఇండియన్ లెవెల్‌లో కింగ్డమ్ రిలీజ్ అవుతోంది. టైటిల్ విషయంలో వచ్చిన అభ్యంతరాల వల్ల హిందీలో మాత్రం సామ్రాజ్య పేరుతో విడుదల చేస్తున్నారు.
Also Read- Spirit Movie: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ – స్పిరిట్ గురించి ఈ విషయం తెలుసా?
సటిల్డ్‌గా…
గత సినిమాల ప్రమోషన్స్‌లో అగ్రెసివ్‌గా కనిపించిన విజయ్ దేవరకొండ ఈ సారి మాత్రం సెలైంట్ అయిపోయాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎలాంటి స్టేట్‌మెంట్స్ ఇవ్వకుండా సటిల్డ్‌గా మాట్లాడటం ఫ్యాన్స్‌లో ఆసక్తికరంగా మారింది.
రౌడీ జనార్ధన…
కింగ్డమ్ రిలీజైన తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని రౌడీ జనార్ధన షూటింగ్ మొదలుపెట్టబోతున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాకు రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. రౌడీ జనార్ధనతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ హిస్టారికల్ మూవీ చేయబోతున్నాడు విజయ్. ఈ సినిమాకు టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ డైరెక్టర్‌గా వ్యవహరించబోతున్నాడు. ఈ సినిమాలో విజయ్‌కి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.


