Shri Ramayan Katha: ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీలలో పౌరాణిక సినిమాల ట్రెండ్ పెరిగింది. భక్తి ప్రధాన కథాంశాలతో రూపొందుతున్న సినిమాలు వందల కోట్ల వసూళ్లను రాబడుతున్నాయి. స్టార్ హీరోల నుంచి అప్‌కమింగ్ యాక్టర్ల వరకు అందరూ ఈ పౌరాణిక సినిమాల్లో నటించేందుకు ఆసక్తిని చూపుతున్నారు. రామాయణం, మహాభారతంతో పాటు మైథలాజికల్ కథాంశాలతో తెరకెక్కుతోన్న పలు సినిమాలు షూటింగ్‌ను జరుపుకుంటున్నాయి.
అంజలి అరోరా…
హిందీలో శ్రీ రామాయణ్ కథ పేరుతో ఓ మైథలాజికల్ మూవీ రూపొందుతోంది. సీత దృక్కోణం నుంచి రామాయణాన్ని ఈ మూవీ ద్వారా వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు డైరెక్టర్ అభిషేక్ సింగ్. ఈ సినిమాలో సీత పాత్రలో సోషల్ మీడియా సెన్సేషన్ అంజలి ఆరోరా నటిస్తోంది.
నెటిజన్ల ట్రోల్….
తాజాగా అంజలి అరోరా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో చేతిలో పండ్లబుట్ట పట్టుకొని ట్రెడిషనల్ లుక్‌లో అంజలి అరోరా కనిపిస్తోంది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంజలి అరోరా సీత రోల్ చేయడంపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మహా సాధ్వి అయిన సీత పాత్రలో బోల్డ్ బ్యూటీ కనిపించడం అంటే రామాయణాన్ని కించపరిచినట్లేనని ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమాను రిలీజ్ చేయద్దంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read – Balakrishna: ఈసారైనా సీక్వెల్ కలిసొస్తుందా..?
కచ్చా బాదామ్ సాంగ్…
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టింది అంజలి అరోరా. ఆమె చేసిన పలు రీల్స్, వీడియోలు కాంట్రవర్సీ అయ్యాయి. ఈ వివాదాల కారణంగా సోషల్ మీడియాలో అంజలి అరోరాకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అంజలి అరోరాకు కోటి ముప్పై లక్షలకుపైనే ఫాలోవర్లు ఉన్నారు. కచ్చా బాదమ్ పాటతో ఫేమస్ అయ్యింది. ఈ పాటలో అందాలను ఆరబోసింది. కచ్చా బాదామ్ సాంగ్ యూట్యూబ్‌లో ఇరవై మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకున్నది. సీత పాత్రను చేయడంపై వస్తోన్న విమర్శలపై గతంలో అంజలి అరోరా రియాక్ట్ అయ్యింది. సోషల్ మీడియాలో తనకున్న ఇమేజ్‌ను బట్టి కాకుండా సినిమాలో నా యాక్టింగ్ చూసి మాట్లాడితే బాగుంటుందని విమర్శకులకు బదులిచ్చింది. నటనతోనే ఈ ట్రోల్స్‌కు సమాధానం చెబుతానని పేర్కొన్నది.
రణభీర్‌కపూర్ రామాయణ…
రామాయణ ఆధారంగా బాలీవుడ్‌లో అంజలి అరోరా శ్రీ రామకథతో పాటు రణభీర్ కపూర్ రామాయణ మూవీ కూడా రూపొందుతోంది. దాదాపు 2000 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీలో సీత పాత్రలో సాయి పల్లవి కనిపించబోతున్నది. రణభీర్‌కపూర్ రాముడిగా నటిస్తుండగా… కేజీఎఫ్ హీరో యశ్ రావణుడిగా కనిపించనున్నారు.
Also Read – Ravi Teja: సినిమాల్లోకి రవితేజ కూతురు ఎంట్రీ – హీరోయిన్‌గా కాదండోయ్!


