Friday, November 22, 2024
Homeచిత్ర ప్రభAnjaliDevi: ఆమె వెండితెర సీతమ్మ

AnjaliDevi: ఆమె వెండితెర సీతమ్మ

సీతాదేవి అనగానే ఠక్కుమని గుర్తొచ్చేది అంజలీ దేవినే. అభినవ సీతమ్మగా పాపులర్ అయిన ఆమెకు ఇంట్రడక్షనే అవసరం లేనంత లెజెండరీ యాక్ట్రెస్. 1950-75 తరాల్లో వెండితెరను ఏలిన మకుటం లేని మహారాణి మన అంజలీ దేవి. తెలుగు ప్రైడ్ గా మనమంతా ఇప్పటికీ గుర్తుచేసుకునే మహానటి అంజలీ దేవి. యాక్ట్రెస్ మాత్రమే కాదు డ్యాన్సర్ కాబట్టే ఆమె ప్రతి కదలికలోనూ అందం, గ్రేస్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది.

- Advertisement -

రియల్ లైఫ్ హైలైట్..

అంజలి పర్సనల్ లైఫ్ లో పెద్ద కాంట్రవర్సీలు లేవు. ఇంట్రెస్టింగ్ థింగ్స్, సీక్రెట్స్ అస్సలు లేవు. తన యాక్టింగ్ కెరీర్ ను థియేటర్ తో అంజలీ దేవి స్టార్ట్ చేశారు. పీ ఆదినారాయణ రావు అంజలి భర్త. ఈయన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ కూడా. తన డైలాగ్ డెలివరి, ఎక్స్ ప్రెషన్స్, డ్యాన్స్ ఒకటేమిటి అంజలీ అంటేనే యునీక్ అనేలా ఉంటుంది. తొలితరం తెలుగు నటుల్లో అంజలీ దేవి ద బెస్ట్ అండ్ అల్టిమేట్ యాక్ట్రెస్ అనేంత ఆమె పాపులర్. ఆమె సెలెక్ట్ చేసుకున్న స్టోరీ, రోల్స్ స్పెషల్ గా ఉంటాయి. అంజలీ యాక్ట్ చేసిన సినిమాలంటే అన్ని వయసుల వారికి అప్పట్లో ఇంట్రెస్ట్ ఉండేది. అప్పట్లో థియేటర్ తప్ప సినిమాలంటే ఇష్టపడనివారు కూడా థియేటర్స్ కు వచ్చేలా చేసింది.

పెద్దాపురంలో పుట్టారు..

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో 1927లో పుట్టారు అంజలి. తెలుగు ఫిలిం డైరెక్టర్ సీ పుల్లయ్య అంజలీ కుమారి పేరును అంజలీ దేవిగా మార్చారు. 1936లో అంజలి ఫస్ట్ మూవీ రాజా హరిశ్చంద్ర రిలీజ్ అయింది. ఇందులో చాలా చిన్న రోల్ ప్లే చేశారు. ఆతరువాత కష్టజీవి అనే సినిమాతో ఆమె హీరోయిన్ గా మారారు. ఇక వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్లారు.

లవకుశలో ఎన్టీఆర్ రాముడిగా, అంజలీ దేవి సీతమ్మగా చేసిన సినిమా అతిపెద్ద బ్లాక్ బస్టర్. ఇప్పటికీ లవకుశ సినిమా అన్నా, పాటలన్నా, డైలాగులన్నా తెలుగు వాళ్లు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. రామాయణంపై ఎన్ని సూపర్ హిట్ సినిమాలు వచ్చినా.. ఎన్ని ప్రయోగాలు చేసి.. కొత్త టెక్నాలజీతో రామాయణం మూవీ తీసినా లవకుశకు మాత్రం తిరుగు లేదు. లవకుశ ఓ ఎపిక్ మూవీ, క్లాసిక్ హిట్, అంజలీ అందులో క్లాసిక్ హీరోయిన్ గా అందరి హృదయాలను కొల్లగొట్టారు.

రియల్ లైఫ్ సీతమ్మ అనుకుని పాదపూజ..

ఎన్టీఆర్ ను కృష్ణుడిగా, రాముడిగా ఎలా అనుకుంటారో అంజలీ దేవిని కూడా అలాగే సీతమ్మ అనుకునేవారు ఫ్యాన్స్. అందుకే ఆమెకు పాదపూజ చేసేవారు, ఆమెకు దండం పెట్టేవారికి అప్పట్లో లెక్కలేదట. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే సీతమ్మ వచ్చింది అని హడావుడి చేసేవారు. ఆమెకు సాష్టాంగ నమస్కారాలు చేసేవారంట పల్లెల్లో. అది యాక్ట్రెస్ గా జీవించటం అంటే. అప్పట్లో మీడియాలో ప్రముఖంగా ఈ న్యూస్ వచ్చింది కూడా. లవకుశ సినిమా మైథలాజికల్ సినిమాల్లో అతిపెద్ద ట్రెండ్ సెట్టర్. ఈ రికార్డ్ ఇప్పటికీ ఇలాగే పదిలంగా ఉంది. అందుకే ఆసినిమాకు అప్పట్లో రాష్ట్రపతి అవార్డ్ కూడా వచ్చింది.

ఏదీ అతి చేయని నటి

అతి మేకప్ అస్సలు లేకపోవటం, ఓవర్ యాక్షన్ చేయకపోవటం అంజలీ దేవి స్పెషాలిటీ అని చెప్పాలి. ఆమె చాలా నాచురల్ గా ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ పెడతారు. నాటకాల్లో ఎంత నాచురల్ గా, స్పాంటేనియస్ గా ఉంటారో సిల్వర్ స్క్రీన్ పైన కూడా అచ్చం అలాగే ఉండటం ఈమెకే చెల్లిందంటారు ఫిలిం క్రిటిక్స్. సువర్ణసుందరి, అనార్కలి వంటి సినిమాల్లో అయితే అంజలీ దేవి అదరగొట్టేశారు. అప్పటికే ఆమె ప్యాన్ ఇండియా స్టార్. తమిళ్, కన్నడ లాంగ్వేజెస్ లో కూడా అంజలీ దేవి యాక్ట్ చేశారు. ఆమె సినిమాలు వేరే ఇండస్ట్రీల్లోనూ హిట్ కొట్టేవి.

నటిగా సత్తా చాటారు

యాక్ట్రెస్ అంటే జస్ట్ హీరోయిన్ గా మాత్రమే యాక్ట్ చేయటం కాదు. సపోర్టింగ్ రోల్స్ కూడా చేయగలిగి సత్తా చాటుకోవాలి. న్యూ జనరేషన్ తో పోటీపడి వారితో స్క్రీన్ షేర్ చేస్తూ శెభాష్ అనిపించుకోవాలని రియల్ స్టార్స్ తాపత్రయపడతారు. అంజలీ కూడా హీరోయిన్ గా ఫేడవుట్ అయ్యాక ఇలాంటి సపోర్టింగ్ రోల్స్ చాలానే ప్లే చేశారు. అన్నావదిన, పోలీస్ అల్లుడు, బృందావనం వంటి సినిమాల్లో ఆమె తన స్టైల్లో యాక్ట్ చేశారు.

ప్రొడ్యూసర్ కూడా..

భక్త తుకారాం, చండీప్రియ సినిమాలను ఆమె ప్రొడ్యూస్ చేశారు. అనార్కలి సినిమాలో హీరోయిన్ గా ప్లే చేస్తూనే ఆ సినిమాను ప్రొడ్యూస్ చేసి హిట్ కొట్టారు అంజలీ. చండీప్రియలో జయప్రద హీరోయిన్ గా, శోభన్ బాబు, చిరంజీవిలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు అంజలీ. అంజలీ పిక్చర్స్ అనే పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన ఆమె మొత్తం 27 సినిమాలు నిర్మించటం హైలైట్.

ఫిదా అవ్వాల్సిందే..

అనార్కలి, సువర్ణ సుందరి, చెంచులక్ష్మి, జయభేరి అనే సినిమాల్లో అంజలి పర్ఫార్మెన్స్ కు అందరూ ఫిదా అయ్యారు. అందుకే నాలుగుసార్లు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ కూడా వచ్చింది. నాగార్జున యూనివర్సిటీ ఆమెకు గౌరవ డాక్టరేట్ ఇచ్చి సన్మానించింది. రఘుపతి వెంకయ్య పురస్కారం ఇచ్చి మన తెలుగువారు అంజలీ దేవిని గౌరవించుకున్నారు. లైఫ్ టైం అఛీవ్మెంట్ అవార్డు సైతం అందుకున్నారు. రామినేని పురస్కారం, ఏఎన్ఆర్ జాతీయ అవార్డ్ఇలా అన్నిప్రముఖ అవార్డులు సొంతం చేసుకున్న కంప్లీట్ యాక్ట్రెస్, గ్రేట్ యాక్ట్రెస్ అంజలీ. ఆమెకు ఇద్దరు కుమారులు. అందాల మేటి నటి అయిన అంజలి వ్యక్తిగతంగా సత్యసాయిబాబా భక్తురాలు. స్వతహాగా ఆమె చాలా అందగత్తెనే కాదు చాలా మితభాషి కూడా. సెలబ్రిటీని కదా అని బీరాలకు పోరు. చాలా సింపుల్ గా ఉంటారు. కాంట్రవర్సీలకు వీలైనంత దూరంగా ఉండటం ఈమె పర్సనల్ ఛాయిస్. విచిత్రంగా ఉందికదూ ఇలాంటి లెజెండరీ యాక్ట్రెస్ కూడా ఉంటారా అంటారా.

హోరీయిన్ ఓరియెంటెడ్ కు కేరాఫ్

బాలనాగమ్మ వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ లో అంజలీ భలే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సతీ సులోచన, స్వర్ణమంజరి, పచ్చని సంసారం, నాగ దేవత, భూలోక రంభ, సతీ అనసూయ, చరణదాసి, ఇలవేల్పు, వదినగారి గాజులు, తిలోత్తమ, స్వప్న సుందరి, మాయావతి, గొల్లభామ ఇలాంటి సినిమాలన్నీ చూసినప్పుడు అసలు అంజలీని దృష్టిలో పెట్టుకునే ఈ కథలన్నీ తెరకెక్కించారనిపిస్తుంది. ఆమె ఈ సినిమాల్లో లీడ్ రోల్ ప్లే చేసిన స్టైలే సినిమాకు ప్రాణం. లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే ఇప్పట్లో అతిపెద్ద ఛాలెంజ్ అనుకుంటున్నారు. కానీ సోషల్ మీడియా లేని రోజుల్లోనే ఈమె ఫిలిం ఇండస్ట్రీని ఏలారు. ఒంటిచేత్తో సినిమాను వంద రోజులు ఆడేలా చేశారు. తన గ్లామర్, ఇమేజ్ తో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు కాసుల వర్షం కురిసేలా చేసిన సత్తా ఉన్నహీరోయిన్ అంజలీ దేవి అని పదేపదే ప్రూవ్ చేసుకున్న గ్లామ్ డాల్.

ఎస్వీఆర్ ను కష్టకాలంలో ఆదుకుంది..

ఎస్వీ రంగారావును కష్టకాలంలో ఆదుకున్నది ఈమెనే. తన ఇంటికి ఎప్పుడు వచ్చినా ఆయనకు కడుపునిండా భోజనం పెట్టాలని ఇంట్లో వారిని అంజలీ దేవి ఆర్డర్ చేశారు. ఎస్వీఆర్, అంజలీదేవి సినిమాల్లోకి రాకముందు నుంచే ఇద్దరూ ఒకరికి ఒకరు పరిచయం ఉన్నారు. ఇద్దరూ నాటకాల్లో కలిసి నటించారు. అందుకే మద్రాసులో అంజలీ దేవి ఇంట్లో తరచూ భోజనం చేసేవారు ఎస్వీ రంగారావు.

50 బెస్ట్ యాక్ట్రెస్ లో ఒకరు

50 బెస్ట్ సౌత్ ఇండియన్ యాక్ట్రెసెస్ లో అంజలీ దేవి ఒకరు. 500కు పైగా సౌత్ ఇండియన్ మూవీస్ లో యాక్ట్ చేశారు. రియల్ లైఫ్ లో పిల్లల తల్లైనా రీల్ లైఫ్ లో మాత్రం ఆమె స్టార్ యాక్ట్రెస్ గా మెరిసిపోయారు. అప్పట్లో అమ్మాయిలు సినిమాల్లో నటించటం చాలా రేర్. కానీ ఆ ట్రెండ్ కు ఫుల్ స్టాప్ పెట్టిన ఫస్ట్ జనరేషన్స్ హీరోయిన్స్ లో అంజలీ ఒకరు. క్లాస్ ఆడియన్స్, మాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్, పెద్దవాళ్లు ఇలా అన్ని తరాలవారికి ఆమె ఆరాధ్య దైవంగా పూజలందుకున్నారు. ఈ అవకాశం బహుశా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మరే హీరోయిన్ కు దక్కలేదు. ఇండియన్ బ్యూటీ అనే సినిమాతో అంజలీ దేవి మనువరాలు సాయిలా రావు హీరోయిన్ గా ఎదిగారు. అంజలీ దేవి సత్యసాయి భక్తురాలు కావటంతో ఆయన పేరు కలిసి వచ్చేలా సాయిలా రావు అని మనువరాలికి పేరు పెట్టుకున్నారు. అంజలీ దేవి మరణానంతరం తన ఆర్గాన్స్ ను రామచంద్ర మెడికల్ కాలేజ్ కు డొనేట్ చేయటం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News