Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభAnother hero in Six pack: సిక్స్ ప్యాక్ కిల్లర్ లుక్ లో యంగ్...

Another hero in Six pack: సిక్స్ ప్యాక్ కిల్లర్ లుక్ లో యంగ్ హీరో

సినిమా సినిమాకు కొత్త లుక్ లో..

తెలుగులో సిక్స్ ప్యాక్ కిల్లర్ లుక్స్ లో కనిపించేందుకు యంగ్ హీరోలంతా క్యూ కడుతున్నారు. లేటెస్ట్ గా ఈ సిక్స్ ప్యాక్ గెటప్ లోకి హీరో ఆనంద్ దేవరకొండ వచ్చి చేరారు. ఇప్పటికే ఆనంద్ సోదరుడు విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ లో అమ్మాయిలకు క్రేజీ హీరోగా మారారు. ఇప్పుడు ఆనంద్ కూడా మేకోవర్ చేసుకుని మరింత డైనమిక్ గా కనిపిస్తుండటం హైలైట్.

- Advertisement -

గం..గం..గణేశా కోసం..

తన ప్రతి సినిమాకు కథల ఎంపికలో కొత్తదనం చూపిస్తూ వస్తున్నారు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఈసారి “గం..గం..గణేశా” కోసం తన లుక్ కూడా మార్చేశారు. ఆయన ఫస్ట్ టైమ్ ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నారు. సిక్స్ ప్యాక్ తో తన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆనంద్ దేవరకొండ. “గం..గం..గణేశా” యాక్షన్ క్రైమ్ కామెడీ మూవీగా ఈ నెల 31న థియేటర్స్ లోకి రాబోతోంది.

ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad