గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Seenu) కాంబోలో ‘అఖండ2- తాండవం'(Akhanda 2) మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. తాజాగా మరో హీరోయిన్ పేరును మేకర్స్ వెల్లడించారు. ‘విరూపాక్ష’ ఫేమ్ సంయుక్త మేనన్ ఈ మూవీలో నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ఓ పోస్టు పెట్టారు.
ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దసరా పండుగా సందర్భంగా సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ చేయనున్నారు. కాగా బాలయ్య, బోయపాటి కయిలకలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచిన విషయం విధితమే. కరోనా సమయంలో వచ్చిన ‘అఖండ’ మూవీ అయితే బాలయ్య అభిమానులకు పూనకాలు తెప్పించింది. ‘అఖండ2’తో కూడా ఇదే మేజిక్ రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.